Home> టెక్నాలజీ
Advertisement

Sony Best Smart Tv: హై టెక్నాలజీతో మార్కెట్‌లో Sony Bravia 4K డిస్‌ప్లే టీవీ, ఫీచర్స్‌ అన్ని అదుర్స్‌..

Sony Bravia Bz50L Series 98: ప్రముఖ టెక్‌ కంపెనీ సోనీ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ టీవీని తర్వలోనే లాంచ్‌ చేయబోతోంది. అయితే ఇప్పటికే సోనీ టీవీకి సంబంధించిన మోడల్‌ను కూడా అధికారిన వెబ్‌ సైట్‌లో పేర్కోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్‌ ఎంటో మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

Sony Best Smart Tv: హై టెక్నాలజీతో మార్కెట్‌లో Sony Bravia 4K డిస్‌ప్లే టీవీ, ఫీచర్స్‌ అన్ని అదుర్స్‌..

 

Sony Bravia Bz50L Series 98: మార్కెట్లో స్మార్ట్ టీవీలకు మంచి డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ టీవీని వినియోగించడం వినియోగించడం వల్ల దీనిని దృష్టిలో పెట్టుకుని టెక్ కంపెనీలు అధిక ఫీచర్లతో టెలివిజన్లను రూపొందిస్తున్నాయి. ఇటీవలే సోనీ కంపెనీ బ్రావియా X90L సిరీస్ స్మార్ట్ టీవీ ని విడుదల చేసింది. ఇది మార్కెట్లో అత్యంత టెక్నాలజీ కలిగిన టీవీగా మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు సోనీ బ్రావియా డిస్‌ప్లేతో కూడిన కొత్త BZ50L TV సిరీస్‌ స్మార్ట్ టీవీ లాంచ్ అయింది. దీని డిస్‌ప్లే XR ట్రిలుమినస్ ప్రో కలర్ టెక్నాలజీతో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Sony Bravia BZ50L 98-అంగుళాల పరిమాణం కలిగిన స్మార్ట్ టీవీ ఈ కామర్స్ వెబ్సైట్లో  ధర రూ. 20,00,000 అందుబాటులోకి జూలై 28 నుండి దేశవ్యాప్తంగా లభించబోతోంది. ఈ స్మార్ట్ టీవీ 4K డిస్‌ప్లేతో పాటు హై టెక్నాలజీతో రూపొందించినట్లు సమాచారం. అంతేకాకుండా డాల్బీ విజన్ టెక్నాలజీ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇక సౌండ్ అవుట్‌పుట్‌ విషయానికి వస్తే..40W సౌండ్ స్పీకర్స్ అందుబాటులో ఉండడం వల్ల మంచి సౌండ్ అనుభూతిని పొందవచ్చు. ఇవే కాకుండా చాలా రకాల స్పెసిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. 

Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో

Sony Bravia BZ50L స్పెసిఫికేషన్లు:
❊ 4K డిస్‌ప్లే
❊ 98-అంగుళాల డిస్ప్లే స్లిమ్ బెజెల్స్‌
❊ 120Hz రిఫ్రెష్ రేట్
❊ డాల్బీ విజన్ టెక్నాలజీ
❊ XR మోషన్ క్లారిటీ
❊ 40W సౌండ్ అవుట్‌పుట్‌
❊ సైడ్ బ్యాక్ క్వాడ్ స్పీకర్ సిస్టమ్‌
❊ VESA హోల్-పిచ్ డిజైన్‌
❊ ల్యాండ్‌స్కేప్ ఓరియంటేషన్‌
❊ బ్రావియా డిస్‌ప్లే XR కలర్
❊ XR కాంట్రాస్ట్ ఫీచర్
❊ 32GB నిల్వతో కాగ్నిటివ్ ప్రాసెసర్
❊ AirPlay
❊ WiFi, HDMI

Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More