Home> టెక్నాలజీ
Advertisement

App Permissions: యాప్స్‌కు కెమేరా, లొకేషన్ అనుమతులిచ్చేశారా, ఎలా మార్చుకోవాలి

App Permissions: స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగేకొద్దీ మోసాలు కూడా పెరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులు, యూపీఐ చెల్లింపులు, ఆన్‌లైన్ యాప్స్ ఇలా అన్నీ స్మార్ట్‌ఫోన్‌లో ఇమిడిపోయి వివిధ రకాల సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసాలకు కారణం యాప్ పర్మిషన్లు. పూర్తి వివరాలు మీ కోసం.

App Permissions: యాప్స్‌కు కెమేరా, లొకేషన్ అనుమతులిచ్చేశారా, ఎలా మార్చుకోవాలి

App Permissions: ఓ వైపు స్మార్ట్‌ఫోన్లు, మరోవైపు ఇంటర్నెట్ డేటా విస్తృతంగా ఉపయోగంలో రావడంతో ఆన్‌లైన్ మోసాలు కూడా ఎక్కువయ్యాయి. కొన్ని రకాల లోన్ యాప్స్, ఇతర యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ఇచ్చే అనుమతులు ఈ సైబర్ మోసాలకు దారితీస్తున్నాయి. అంటే మనకు తెలియకుండా మనమే సైబర్ నేరగాళ్లు మోసం చేసేందుకు అనుమతిచ్చేస్తున్నాం. 

కొన్ని రకాల యాప్స్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసేటప్పుడు స్మార్ట్‌ఫోన్లలో ఉంటే కెమేరా, మైక్రోఫోన్, లొకేషన్ యాప్స్ యాక్సెస్ చేసేందుకు అనుమతులు అడుగుతుంటాయి. ఇక్కడే మనం అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మన డేటా మొత్తం సైబర్ నేరగాళ్లబారిన పడవచ్చు. అందుకే యాప్స్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అనుమతులు తప్పనిసరి అయితే మాత్రం Allow only while using the app ఆప్షన్ ఎంచుకోవాలి. దీనివల్ల డేటా చోరీ చాలావరకూ నియంత్రితమౌతుంది. లేదా Ask Every Time అనుమతి ఇవ్వడం ద్వారా తాత్కాలికంగా వెసులుబాటు కల్పించవచ్చు. లేకపోతే మీ ఫోన్‌లోని సున్నితమైన సమాచారం మోసగాళ్ల బారిన పడవచ్చు. 

వీలైనంతవరకూ  Dont Allow ఆప్షన్ ఎంచుకుంటే మంచిది. కానీ కొన్ని యాప్స్ అనుమతులు ఇవ్వకుంటే పనిచేయవు. అందుకే ఒకవేళ అనుమతులు ఇచ్చినా ఆ తరువాత వాటిని మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ అయితే సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. తరువాత యాప్స్‌లోకి వెళ్లి పర్మిషన్స్ క్లిక్ చేయాలి. అందులో కెమేరా, లొకేషన్, కాంటాక్ట్, మైక్రోఫోన్ వంటి ఆప్షన్లు గుర్తించి తొలగించవచ్చు.

Also read: Honor 200 Series: 50MP సెల్ఫీ, మెయిన్ కెమేరాతో హానర్ 200 సిరీస్ ఫోన్లు లాంచ్ ఎప్పుడు, ధర ఎంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More