Home> టెక్నాలజీ
Advertisement

Samsung Galaxy M53 5G Price: అమెజాన్‌లో Samsung Galaxy M53 5G స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌, ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే!

Samsung Galaxy M53 5G Price: అతి తక్కువ ధరలో Samsung Galaxy M53 5G స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో కొనుగోలు చేయోచ్చు. 

 Samsung Galaxy M53 5G Price: అమెజాన్‌లో Samsung Galaxy M53 5G స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌, ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే!

 

Samsung Galaxy M53 5G Price: ప్రస్తుతం చాలా మంది యువత 108 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన స్మార్ట్‌ ఫోన్స్‌ కొనుగోలు చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా మంచి కెమెరా కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌ ప్రత్యేక డీల్స్‌లో భాగంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా సాంసంగ్‌ బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ ఫోన్స్‌ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. అయితే అమెజాన్‌లో ఏయే మొబైల్స్‌పై ఎలాంటి ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో, ఏ స్మార్ట్ ఫోన్‌ ప్రత్యేక డీల్‌లో భాగంగా డెడ్‌ చీప్‌గా లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.   

అమెజాన్ ఇండియాలోని Samsung Galaxy M53 5G స్మార్ట్‌ ఫోన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్‌ MRP ధర రూ.32,999 ఉండగా ప్రత్యేక డీల్‌లో భాగంగా  రూ.26,999కే లభిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌ వినియోగించి దాదాపు రూ. 1,500 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు. ఇలా బ్యాంక్‌ ఆఫర్స్‌ పోను ఈ Samsung Galaxy M53 5G మొబైల్‌ ఫోన్‌ కేవలం రూ.25,499కే లభిస్తోంది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

ఎక్చేంజ్‌ ఆఫర్‌:
అమెజాన్ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు ముందుగా పాత స్మార్ట్‌ ఫోన్‌ని ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.24,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ Samsung Galaxy M53 5G స్మార్ట్‌ ఫోన్‌ను రూ.1,499కే పొందవచ్చు. అయితే ఈ బోనస్‌ అనేది మీరు ఎక్చేంజ్‌ చేసే పాత స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. మీ మొబైల్‌ కండీషన్‌, బ్రాండ్‌ బాగుంటే పై డిస్కౌంట్‌ పొందవచ్చు. దీంతో పాటు ఈ మొబైల్‌ను రూ. 1309 చెల్లించి EMIతో కూడా కొనుగోలు చేయోచ్చు. 

ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు:
8 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌
MediaTek Dimension 900 చిప్‌సెట్‌
6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లే
డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌
కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ ప్రొటక్షన్‌
120Hz రిఫ్రెష్ రేట్‌
ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌
108-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా
2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా
2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ కెమెరా
8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ
25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More