Home> టెక్నాలజీ
Advertisement

Realme Narzo N53 Offer Price: ప్రీమియం ఫీచర్లు, బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ ఊహించని ప్రత్యేక డిస్కౌంట్, కేవలం 8 వేలకే

Realme Narzo N53 Offer Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మి నుంచి మరో కొత్త మోడల్ లాంచ్ అయింది. తాజాగా విక్రయాలు ప్రారంభించింది. ఎవరూ ఊహించని ధరకే ఈ ఫోన్ లబించనుంది. బ్రాండెడ్ స్మార్ట్ పోన్ కావాలంటే ఇంతకంటే తక్కువ ధరకు మరేదీ దొరకదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Realme Narzo N53 Offer Price: ప్రీమియం ఫీచర్లు, బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ ఊహించని ప్రత్యేక డిస్కౌంట్, కేవలం 8 వేలకే

Realme Narzo N53 Offer Price: రియల్ మి నుంచి ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చింది. భారీ డిస్కొంట్ తో ఈ పోన్ విక్రయాలు జరుగుతున్నాయి. ఎవరూ ఊహించని ధరకు ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. కేవలం 8 వేలకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన Realme Narzo N53 అందుకోవచ్చు.

Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ 6.74 అంగుళాల డిస్ ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ టచ్ రేట్ శాంప్లింగ్ 180 హెర్ట్జ్ కాగా ఆక్టాకోర్ యూనిశాక్ టి612 చిప్ సెట్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో ARM Mali G57 GPU ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. కేవలం 30 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఈ పోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. సెక్యూరిటీ కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. 

ఈ ఫోన్ లో కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0 యూఎస్ బి టైప్ సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం ఉంది. ఇక కెమేరా పరంగా అయితే ఎల్ఈడీ ఫ్లాష్ తో 50 మెగాపిక్సెల్ ఏఐ సపోర్ట్ ప్రైమరీ కెమేరా ఉంటుంది. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఈ ఫోన్ ఫెదర్ బ్లాక్, ఫెదర్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది. 

Realme Narzo N53 ఫోన్ ధర 11,999 రూపాయలు కాగా సూపర్ ప్రైసింగ్ డీల్ లో భాగంగా 3000 డిస్కౌంట్ లభిస్తోంది. అంటే 8,999 రూపాయలకే అందుకోవచ్చు. అదే మొబిక్విక్ ద్వారా కొనుగోలు చేస్తే 1000 రూపాయలు అదనంగా క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు.

Also read: Cheap and Best Hatchback Car: SUV డిజైన్‌తో బెస్ట్ Hatchback కారు, ధర కూడా చాలా తక్కువ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More