Home> టెక్నాలజీ
Advertisement

Realme C65 Launch: రియల్‌మి నుంచి మరో స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు మామూలుగా లేవుగా

Realme C65 Launch: ప్రముఖ ఛైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి మరో అద్భుతమైన బడ్జెట్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే వియత్నాం మార్కెట్‌లో విడుదలైన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 

Realme C65 Launch: రియల్‌మి నుంచి మరో స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు మామూలుగా లేవుగా

Realme C65 Launch: చైనా స్మార్ట్‌ఫోన్లలో రెడ్ మి, రియల్‌మి ఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఎక్కువ. ధర అందుబాటులో ఉండటమే కాకుండా అద్భుతమైన ఫీచర్లు ఉండటం ఇందుకు కారణం. అంతేకాకుండా ఎప్పటికప్పుు కొత్త మోడల్స్ ప్రవేశపెడుతుంటుంది. ఇప్పుుడు మరో కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ చేసేందుకు సిద్ధమౌతోంది. 

Realme C65 పేరుతో ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. 6.67 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి మీడియాటెక్ హెలియో జి 85 ప్రోసెసర్‌తో వస్తోంది. ఆండ్రాయిండ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇక ర్యామ్ 8జీబీ ర్యామ్‌కు అదనంగా మరో 8 జీబీ వర్చువల్ కావడంతో ఫోన్ పని తీరు చాలా వేగంగా ఉంటుంది. ఇక స్టోరేజ్ 256 జీబీ వరకూ అందుబాటులో ఉంటుంది. కెమేరా విషయంలో కూడా ఇతర ఫోన్ల కంటే దీటుగా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లెన్స్ కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ప్రత్యేకంగా ఉంది. 

Realme C65 మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. ఇందులో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 12 వేల రూపాయలుగా ఉంది. ఇక 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అయితే 14 వేల రూపాయలు ఉంటుంది. అదే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర 16 వేల రూపాయలుంటుంది. త్వరలో ఇండియాలో లాంచ్ కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 

Also read: Blue Tick: ఎక్స్‌లో మళ్లీ బ్లూ టిక్ వచ్చేసిందిగా, నో పేమెంట్, అంతా ఉచితమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More