Home> టెక్నాలజీ
Advertisement

Realme Festive Days Sale 2023: రియల్ మీ 5G స్మార్ట్‌ఫోన్స్ పై భారీ తగ్గింపు..ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!

ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రముఖ ఈ - కామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లలో పండగ సేల్స్ మొదలు కానున్నాయి. అక్టోబర్ 8న ప్రారంబం కానున్న ఈ సేల్ అక్టోబరు 15 వరకు కొనసాగనుంది. రియల్ మీ ఫోన్ల పై అదిరిపోయే డిస్కౌంట్స్ తో పాటు అద్భుతమైన డీల్స్ కస్టమర్లకు అనిందించనున్నాయి.

Realme Festive Days Sale 2023:  రియల్ మీ 5G స్మార్ట్‌ఫోన్స్ పై భారీ తగ్గింపు..ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!

Realme Festive Days Sale 2023: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ సరికొత్త ఫెస్టివల్ డేస్ సేల్ ప్రకటించింది. అక్టోబర్ 8న ప్రారంబం కానున్న ఈ సేల్ అక్టోబరు 15 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా రియల్ మీ మొబైల్స్ పై భారీ తగ్గింపు అందుబాటులోకి రానుంది. అదిరిపోయే డిస్కౌంట్స్ తో పాటు అద్భుతమైన డీల్స్ కస్టమర్లను ఆకర్షించనున్నాయి. ఈ సేల్ సందర్భంగా AI ఆపరేటింగ్ టెక్నాలజీ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు రానుంది. ఈ డీల్స్, డిస్కౌంట్స్ అన్ని రియల్ మీ అధికారిక వెబ్‌సైట్ తో పాటు ప్రముఖ ఈ - కామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లలో కూడా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అయితే ఏఏ మోడల్స్ పై డిస్కౌంట్ వర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

రియల్ మీ 11 ప్రో+ 5G : అమెజాన్ డిస్కౌంట్స్
రాబోయే ఫెస్టివ్ డేస్ సేల్ లో భాగంగా రియల్ మీ నార్జో 60 సిరీస్ 5G, రియల్ మీ నార్జో N53, రియల్ మీ నార్జో N55 పై స్పెషల్ డిస్కౌంట్ అందుబాటులోకి రానుంది. అయితే ఇది ప్రత్యేకంగా అమెజాన్ షాపింగ్ వెబ్ సైట్ లో (Amazon.in, realme.com) ఉండనుంది. ఈ సేల్ ప్రారంభానికి ముందు ఎర్లీ యాక్సెస్ ఆఫర్ లో భాగంగా అక్టోబరు 7 అర్ధరాత్రి నుంచి ఇది అమలు కానుంది. 

అయితే రియల్ మీ 11 ప్రో ప్లస్ లో 8 GB ర్యామ్ వేరియంట్ (realme 11 Pro+ 5G ) మార్కెట్లో అసలు ధర రూ. 27,999 గా ఉంది. అయితే స్పెషల్ డిస్కౌంట్ తర్వాత ఇది రూ. 24,999 కి దక్కుతుంది. అదే విధంగా 12 GB ర్యామ్ వేరియంట్ ను మార్కెట్లో రూ. 29,999 ధరకి విక్రయిస్తుండగా.. డిస్కౌంట్ తర్వాత రూ. 28,999 ధరకు అందుబాటులో ఉండనుంది. 

రియల్ మీ 11 ప్రో 5G: ఫ్లిప్ కార్ట్ ఆఫర్స్ 
సరికొత్త రియల్‌ మీ 11 ప్రో (Realme 11 Pro 5G) స్మార్ట్ ఫోన్ ను ఈ ఫెస్టివ్ డేస్ సేల్ లో భాగంగా భారీ డిస్కౌంట్ తో విక్రయిస్తున్నారు. 8 GB RAM + 128 GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ ను మార్కెట్లో రూ. 23,999 గా ఉండగా.. ఇప్పుడు దాన్ని కేవలం రూ. 19,999 ధరకే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. 

8 GB RAM + 256 GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ అసలు ధర రూ. 24,999 గా ఉండగా.. దీనిపై మరింత డిస్కౌంట్ అందుబాటులోకి రానుంది. మరోవైపు 6 GB ర్యామ్ కలిగిన రియల్ మీ 11 X (Realme 11 X 5G) ఫోన్ అసలు ధర రూ. 14,999గా ఉండగా స్పెషల్ డిస్కౌంట్ తర్వాత రూ. 11,9990కి విక్రయిస్తున్నారు. అలాగే 8 GB వేరియంట్ అసలు ధర రూ. 15,999 ఉండగా.. రూ. 14,999కి అమ్మకానికి ఉంది. 

Also Read: Android 14 Features: ఆండ్రాయిడ్‌ 14 కొత్త వెర్షన్‌ లాంచ్‌..ఫీచర్స్‌ అన్ని వివరాలు ఇవే!  

రియల్ మీ 11 5G డిస్కౌంట్:
8 GB RAM + 128 GB స్టోరేజ్ కలిగిన రియల్‌ మీ 11 (Realme 11 5G) స్మార్ట్ ఫోన్ వేరియంట్ అసలు ధర రూ. 18,999గా ఉంది. ఫెస్టివ్ డేస్ సేల్‌ ఆఫర్‌లో భాగంగా దీన్ని రూ. 15,999కి విక్రయించనున్నారు. 
రియల్‌ మీ C53 (Realme C 53) మొబైల్ లోని 4 GB + 128 GB వేరియంట్ అసలు ధర రూ. 9,999.. డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ. 9,499గా ఉంది. మరోవైపు 6GB + 64GB వేరియంట్ ధర రూ. 10,999కి అమ్ముతుండగా.. 16 GB + 128 GB రూ. 11,999కి విక్రయిస్తున్నారు.

రియల్ మీ నార్జో 60 X 5G ఆఫర్స్:
రియల్‌మీ నార్జ్ 60 X (Realme Narzo 60 X 5G) 6 GB ర్యామ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ ను డిస్కౌంట్ తో ఇప్పుడు కేవలం రూ. 11,499 కే సొంతం చేసుకోవచ్చు. అయితే మార్కెట్లో దీని అసలు ధర రూ. 14,499 గా ఉంది. మరోవైపు రూ.12,999 విలువైన 4GB RAM వేరియంట్ ను రూ. 10,999కి అందుబాటులో ఉంది. అలాగే రియల్ మీ నార్జో N53 స్మార్ట్ ఫోన్ ధర రూ. 7,999 కి కొనుగోలు చేయవచ్చు.

Also Read: Radish Health Benefits: ముల్లంగి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Read More