Home> టెక్నాలజీ
Advertisement

Pink WhatsApp scam: పింక్ కలర్ వాట్సాప్ అని డౌన్లోడ్ చేస్తున్నారా.. ఇలా చేస్తే మీ బ్యాంక్‌లో డబ్బులు లూటీ అవ్వడం ఖాయం..

how can you get scammed on whatsapp: కొంతమంది కేటుగాళ్లు వాట్సాప్ లో షేర్ చేసిన లింకులను నొక్కగానే పింక్ కలర్ వాట్సాప్ డౌన్లోడ్ అవుతోంది. ఇది డౌన్లోడ్ చేసిన గంటల వ్యవధిలోని బ్యాంకులో నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

Pink WhatsApp scam: పింక్ కలర్ వాట్సాప్ అని డౌన్లోడ్ చేస్తున్నారా.. ఇలా చేస్తే మీ బ్యాంక్‌లో డబ్బులు లూటీ అవ్వడం ఖాయం..

 

Pink WhatsApp scam: టెక్నాలజీ పెరగడం కారణంగా మొబైల్ ఫీచర్స్, యాప్స్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. ముఖ్యంగా యాప్స్ విషయానికొస్తే ప్రతి నెల ఏదో ఒక ఫీచర్ ని అందిస్తూనే ఉన్నాయి. తాజాగా వాట్సాప్ లో కొత్తగా చాలా రకాల ఫీచర్లు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా ఎన్ని రకాల ఫ్యూచర్లు వచ్చిన ఐకాన్ మాత్రం గ్రీన్ కలర్ లోనే ఉండిపోయింది. అయితే ఇటీవలే కొందరు కేటు గాళ్లు వాట్సప్ గ్రీన్ కలర్ నుంచి పింకు కలర్ కు మారిపోయిందని మీది ఇంకా అప్డేట్ చేయలేదనే మెసేజ్ తో పాటు లింకును కూడా షేర్ చేస్తున్నారు. తెలిసి తెలియక ఈ పింక్ కలర్ వాట్సాప్ ను డౌన్లోడ్ చేసుకున్నవారు నిలువు దోపిడీ అవుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. 

వాట్సాప్ ఎన్ని మార్పులు వచ్చిన గ్రీన్ కలర్ లోనే ఉంటుంది కానీ పింక్ కలర్ లోకి అసలు మారదు. కొందరు సైబర్ మోసగాళ్లు నిలువు దోపిడీ చేయడానికి తయారుచేసిన యాపే పింక్ కలర్ వాట్సప్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది పింకు కలర్ కు సంబంధించిన వాట్సాప్ లింకులు విచ్చలవిడిగా షేర్ చేస్తున్నారని వీటిని డౌన్లోడ్ చేసుకున్న ప్రతి వంద మందిలో 40 మంది ఏదో ఒక కారణంగా మోసానికి గురవుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. 

Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

వాట్సాప్ గ్రూపులో వచ్చిన లింకు పై నొక్కగానే అది డూప్లికేట్ వెబ్సైట్లోకి తీసుకువెళ్తుంది. తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ అని చిన్న బార్ కూడా కనిపిస్తుంది. ఇలా ఆ బార్ పై మొక్కగా మళ్లీ వేరే వెబ్సైట్ కి తీసుకువెళ్లిన వెంటనే అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఇలా అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ చేయమని అడుగుతుంది. ఇలా అన్నీ పూర్తయిన తర్వాత మీ చిట్టా మొత్తం హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇలా మొత్తం పూర్తయిన రెండు రోజుల తర్వాత బ్యాంకుకు సంబంధించిన ఓటీపీలు రావడం మొదలవుతాయి.. లేదంటే హ్యాకర్ చేతిలోకే నేరుగా ఓటీపీలు వెళ్తాయి. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అవుతుంది. 

ఈ పింక్ వాట్సాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు చాట్ చేయకపోయినా మీ కాంటాక్ట్ లో ఉన్న నంబర్లు అన్ని హ్యాకర్ల చేతిలోకి వెళ్తాయి. అంతేగాకుండా అప్పుడప్పుడు మీ ప్రమేయం లేకుండానే ఇతరులకు మీ ఖాతా నుంచి సందేశాలు కూడా వెళ్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇలాంటి లింకులను ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే..1930కి ఫోన్ చేసి మీ సమస్యను చెప్పి ఫిర్యాదు చేయవచ్చు. గోల్డెన్ అవర్ లో మీరు ఫిర్యాదు చేస్తే డబ్బులను సులభంగా తిరిగి పొందవచ్చు.

Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More