Home> టెక్నాలజీ
Advertisement

PAN-Aadhaar Link: పాన్ కార్డ్ - ఆధార్ కార్డ్‌కి లింక్ చేశారో చెక్ చేశారా..లేట్ ఫీజుతో లింక్ చేయండిలా!

Last Date for PAN-Aadhaar Linking: ఆధార్ కార్డ్ -పాన్ కార్డ్‌లను లింక్ చేయడానికి చివరి తేదీగా 31 మార్చి 2023ని ఫిక్స్ చేశారు, అయితే లేట్ ఫీజ్ తో ఎలా లింక్ చేయాలి అనేది తెలుసుకోండిలా. 

PAN-Aadhaar Link: పాన్ కార్డ్ - ఆధార్ కార్డ్‌కి లింక్ చేశారో చెక్ చేశారా..లేట్ ఫీజుతో లింక్ చేయండిలా!

Pan-Aadhar Link Process: ఆధార్ కార్డ్ -పాన్ కార్డ్‌లను లింక్ చేయడానికి చివరి తేదీగా 31 మార్చి 2023ని ఫిక్స్ చేశారు. నిర్ణీత గడువులోగా మీరు పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయకపోతే, మీ పాన్ కార్డ్ ఇన్‌యాక్టివ్ అవుతుందని చెబుతున్నారు. అంతేకాదు అప్పుడు లింక్ చేయాల్సి వస్తే రూ. 1000 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆధార్-పాన్ లింక్ స్టేటస్‌ని ఎలా సులభంగా చెక్ చేయవచ్చో చూసేయండి. 

ఆధార్ కార్డ్ -పాన్ కార్డ్‌ లింక్ అయిందా లేదా ఇలా చెక్ చేయండి 

1. ముందుగా లింక్‌ని తెరవండి - https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar...
2. ఇప్పుడు పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు ఎంటర్ చేయండి. 
3. వ్యూ లింక్ ఆధార్ స్టేటస్‌పై క్లిక్ చేయండి.

లేట్ ఫీ ఎలా చెల్లించి లింక్ చేయాలి..? 
1. ముందుగా ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీకి వెళ్లి క్విక్ లింక్స్ విభాగంలో లింక్ ఆధార్‌పై క్లిక్ చేయండి. 
2. మీ పాన్ మరియు ఆధార్ నంబర్‌లను నమోదు చేయండి. 
3. ఇ-పే ట్యాక్స్ ఆప్షన్ ఎంచుకోండి. 
4. పాన్ వివరాలను నమోదు చేసి, ఆపై నిర్ధారించండి. ఆ తర్వాత మీ నంబర్‌కు OTP వస్తుంది. 
5. OTPని ధృవీకరించండి, ఆ తర్వాత నేరుగా ఇ-పే ట్యాక్స్ పేజీకి వెళ్లండి. 
6. ఇప్పుడు ఇన్కంటాక్స్ పై క్లిక్ చేయండి. 
7. అసెస్‌మెంట్ 2023-24కి వెళ్లి (500) ఆప్షన్ ఎందుకోండి.  
8. మొత్తం ముందుగా ఫైల్ చేయబడుతుంది, ఆ తరువాత ఆప్షన్ మీద క్లిక్ చేయండి. 

ఇక ఇప్పుడు చలాన్ జనరేట్ అవుతుంది.దీని తర్వాత, మీరు చెల్లింపు విధానాన్ని ఎంచుకుని, బ్యాంక్ వెబ్‌సైట్‌కి వెళ్లి చెల్లింపు చేయాలి. ఆ తర్వాత మీరు ధృవీకరించాలి. 

1. ఇ-ఫైలింగ్ పై క్లిక్ చేయండి --- లాగిన్ --- ప్రొఫైల్ విభాగంలో లింక్ ఆధార్ విభాగానికి వెళ్లి ఆధార్ లింక్‌పై క్లిక్ చేయండి. 
2. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ధృవీకరించండి. 
3. ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీకి వెళ్లి, క్విక్ లింక్‌ల క్రింద లింక్ ఆధార్‌ ఆప్షన్ చెక్ చేయండి. 
4. పాన్, ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసిన తర్వాత, పే ఆప్షన్ పై క్లిక్ చేయండి. 
5. అక్కడ అడిగిన మొత్తం సమాచారాన్ని ఎంటర్ చేయండి. 
6. ఆ OTP మీ మొబైల్ నంబర్‌కు వస్తుంది, దానిని టైప్ చేయడం ద్వారా దాన్ని ధృవీకరించాలి. 
7. మీ ఆధార్‌ను లింక్ చేసే ప్రక్రియ పూర్తయింది.ఇప్పుడు మీరు లింక్ అయిందో చెక్ చేయవచ్చు. 

Also Read: Akanksha Dubey Suicide: హోటల్ గదిలో ఉరేసుకున్న స్టార్ హీరోయిన్.. పవర్ స్టార్ పవన్ తో చివరి సాంగ్?

Also Read: Actor Innocent death: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. స్టార్ కమెడియన్ మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
Read More