Home> టెక్నాలజీ
Advertisement

Oppo Reno 8T 5G: ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్‌ డిజైన్‌! ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు ఇవే

Oppo Launch Oppo Reno 8T 5G smartphone in India. రెనో 8 సిరీస్ నుంచి ఒప్పో మరొక ఫోన్‌ను విడుదల చేసింది. అదే ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్. 
 

Oppo Reno 8T 5G: ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్‌ డిజైన్‌! ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు ఇవే

Oppo Launch Oppo Reno 8T 5G smartphone in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ 'ఒప్పో'కు భారతదేశ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అందుకే కస్టమర్ల కోసం ఒప్పో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే రెనో 8 సిరీస్ నుంచి మరొక ఫోన్‌ను విడుదల చేసింది. అదే ఒప్పో రెనో 8టీ 5జీ (Oppo Reno 8T 5G). ఈ ఫోన్ డిజైన్ పరంగా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. డిజైన్‌ని చూసి మీరు కొనకుండా ఉండలేరు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 108MP కెమెరా మరియు 4800mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒప్పో రెనో 8టీ 5జీ ఫోన్ ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లను ఇప్పుడు చూద్దాం. 

Oppo Reno 8T 5G Price In India:
ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర భారతదేశంలో రూ.29,999లుగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్ మరియు ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్ సేల్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రెండు రంగులో అందుబాటులో ఉంటుంది. 

Oppo Reno 8T 5G Specifications:
ఒప్పో రెనో 8టీ 5జీ మైక్రో కర్వ్డ్ డిజైన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 171 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్క్రీన్ Dragontrail-Star2 రక్షణతో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా మాడ్యూల్ అందుబాటులో ఉంది.

Oppo Reno 8T 5G Camera:
ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో108MP ప్రైమరీ సెన్సార్ అందుబాటులో ఉంది. ముందు భాగంలో 32MP సెన్సార్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 695 5G SoC ద్వారా పైచేస్తుంది. RAMని 8GB వరకు విస్తరించవచ్చు. ఫోన్ ColorOS 13 పై రన్ అవుతుంది. ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4800mAh బ్యాటరీని కలిగి ఉంది.

Also Read: Xiaomi Electric Car 2023: షియోమీ తొలి ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. సూపర్ లుకింగ్! కానీ భారీ జరిమానా  

Also Read: Water Sprinkler Fan: వేసవిలో ఏసీ అవసరం లేదు.. ఈ ఫ్యాన్ కొంటే కాశ్మీర్ లాంటి చల్లదనం! ధర రూ 1375 మాత్రమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More