Home> టెక్నాలజీ
Advertisement

Oppo A2 5G Price In India: 50 మెగాపిక్సెల్ కెమెరాతో OPPO నుంచి మార్కెట్‌లోకి మరో మొబైల్‌..ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!


Oppo A2 5G Price In India: ఒప్పో నుంచి అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కాబోతోంది. అయితే కంపెనీ ఈ మొబైల్‌ను Oppo A2 5G పేరుతో విడుదల చేయనుంది. ఈ మొబైల్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. 

Oppo A2 5G Price In India: 50 మెగాపిక్సెల్ కెమెరాతో OPPO నుంచి మార్కెట్‌లోకి మరో మొబైల్‌..ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!

 

Oppo A2 5G Price In India: ఒప్పో నుంచి త్వరలోనే మరో స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. ఈ మొబైల్‌ అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో లభించబోతోంది. కంపెనీ ఈ మొబైల్‌ను A-సిరీస్ పేరుతో మార్కెట్‌లోకి లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించి పేరును కూడా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. OPPO A2 5G పేరుతో మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

OPPO A2 5G స్మార్ట్‌ ఫోన్‌ అందమైన బ్యాక్ ప్యానెల్స్‌తో రాబోతోంది. దీంతో పాటు 6.72 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌  MediaTek ఆక్టా-కోర్ ప్రాసెసర్‌పై రన్‌ కాబోతోంది. డ్యూయల్ కెమెరా సెటప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి చాలా రకాల ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. 

OPPO A2 5G స్మార్ట్‌ ఫోన్‌ ధర:
గతంలోనే OPPO A2 5G స్మార్ట్‌ ఫోన్‌ను చైనాలో కంపెనీ లాంచ్‌ చేసింది. మొత్తం ఈ మొబైల్‌ ఫోన్‌ బ్లాక్, గ్రీన్, పర్పుల్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసింది. ఈ OPPO A2 5G స్మార్ట్‌ ఫోన్‌ మొత్తం రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. చైనాలో బేస్ 12GB + 256GB మోడల్ ధర CNY 1699(సుమారు రూ. 19,700)కాగా..12GB + 512GB హో మోడల్‌  ధర CNY 1799 (సుమారు రూ. 20,500)తో కంపెనీ విక్రయిస్తోంది. ఇప్పటికే కంపెనీ ఈ స్మార్ట్‌ ఫోన్‌ పీ ఆర్డర్‌ను కూడా ప్రారంభించింది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

OPPO A2 5G ఫీచర్స్‌ వివరాలు:
ఈ OPPO A2 5G మొబైల్‌ ఫోన్‌ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో రాబోతోంది. దీంతో పాటు టెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌తో 256GB,  512GB రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 13  ColorOS 13.1పై పని చేస్తుంది. ఈ మొబైల్‌ 6.72 అంగుళాల డిస్‌ప్లేతో పాటు ఫుల్ హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. దీంతో ఈ డిస్‌ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్‌ చేస్తుంది. 

ఇతర ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
డ్యూయల్-కెమెరా సెటప్‌
50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా
8 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
IP54 రేటింగ్ వాటర్, డస్ట్ రెసిస్టెంట్ 
స్టీరియో స్పీకర్
33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
5000mAh బ్యాటరీ

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Read More