Home> టెక్నాలజీ
Advertisement

Oneplus Nord Ce4 Price: అమెజాన్‌లో రూ.551కే Oneplus Nord Ce4 మొబైల్‌.. డిస్కౌంట్ వివరాలు చూస్తే షాక్‌..


Oneplus Nord Ce4 Price: ప్రస్తుతం అమెజాన్‌లో Oneplus Nord Ce4 స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌, బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Oneplus Nord Ce4 Price: అమెజాన్‌లో రూ.551కే Oneplus Nord Ce4 మొబైల్‌.. డిస్కౌంట్ వివరాలు చూస్తే షాక్‌..

 

Oneplus Nord Ce4 Price Cut: భారత మార్కెట్‌లో Oneplus మొబైల్స్‌కి ఎంత డిమాండ్‌ ఉందో అందరికీ తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ వన్‌ప్లస్‌ కంపెనీ ప్రతి సంవత్సరం బడ్జెట్‌ దాదాపు 3 నుంచి 4 స్మార్ట్‌ఫోన్స్‌ను తయారు చేసి విడుదల చేస్తోంది. ఇలా లాంచ్‌ చేసిన మొబైల్స్‌లో చాలా వరకు సక్సెస్‌ అవుతున్నాయి. అలాగే వన్‌ప్లస్‌ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన Oneplus Nord Ce4 స్మార్ట్‌ఫోన్ ఎంత సక్సెస్‌ రేటు సంపాదించిందో అందిరికీ తెలిసిందే. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందిస్తోంది. అంతేకాకుండా కొన్ని ఈ కామర్స్‌ కంపెనీల్లో ఈ మొబైల్‌పై ఇతర ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రస్తుతం అమెజాన్‌లో Oneplus Nord Ce4 స్మార్ట్‌ఫోన్‌ మూడు కలర్స్‌తో పాటు రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇందులోని మొదటి వేరియంట్‌ 8GB ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, రెండవ వేరియంట్‌ 8GB ర్యామ్‌తో పాటు 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఇందులో మొదటి వేరియంట్‌ ధర రూ. 26,998 కాగా.. ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా రూ.2,000 తగ్గింపుతో కేవలం రూ.24,998కే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు లభిస్తుంది.

ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, దీనిని వన్‌కార్డ్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే రూ.2000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను రూ. 22,499కే పొందవచ్చు. ఇదే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి బిల్‌ చెల్లిస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా సెలక్టెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌లపై నో కాస్ట్‌ EMI ఆప్షన్స్‌ కూడా అందిస్తోంది. ఇలా కొనుగోలు చేయాలనుకునేవారు నెలకి రూ.1,126 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి బిల్‌ చెల్లించేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. వినియోగిస్తున్న పాత బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.23,050 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ Oneplus Nord Ce4 మొబైల్‌ను కేవలం రూ.551కే పొందవచ్చు.  

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

వన్‌ప్లస్‌ నార్డో సిఈ4 స్మార్ట్‌ఫోన్‌ టాప్ ఫీచర్స్‌:
6.7-అంగుళాల పెద్ద డిస్ప్లే
FHD+ 120Hz AMOLED డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్‌
ఫ్లూయిడ్ స్క్రోలింగ్‌ ఫీచర్‌
Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్
ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్
50MP ప్రధాన కెమెరా
8MP అల్ట్రా-వైడ్ కెమెరా
2MP మాక్రో కెమెరా
16MP సెల్ఫీ కెమెరా
5500mAh బ్యాటరీ
100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్
Android 14తో OxygenOS 14
డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్ (IP54)
5G కనెక్టివిటీ

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More