Home> టెక్నాలజీ
Advertisement

OnePlus Nord CE 3 Lite Price Cut: పిచ్చెక్కించే ఆఫర్‌.. అమెజాన్‌లో ఈ 256GB స్టోరేజ్ వన్‌ప్లస్‌ మొబైల్‌ను కేవలం రూ. 1,040కే పొందండి!


OnePlus Nord CE 3 Lite Price Cut: అతి తక్కువ ధరలోని వన్ ప్లస్ మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ స్మార్ట్ ఫోన్ అది తక్కువ ధరలోని లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

OnePlus Nord CE 3 Lite Price Cut: పిచ్చెక్కించే ఆఫర్‌.. అమెజాన్‌లో ఈ 256GB స్టోరేజ్ వన్‌ప్లస్‌ మొబైల్‌ను కేవలం రూ. 1,040కే పొందండి!

 

OnePlus Nord CE 3 Lite Price Cut: ఎప్పటినుంచో తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి సరైన సమయం రానే వచ్చింది. ముఖ్యంగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ప్రత్యేకమైన సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్‌ను కొనుగోలు చేస్తే 10 నుంచి 20 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు కొన్ని మొబైల్స్‌పై అదనంగా 50 శాతం వరకు కూడా తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. గతంలో మార్కెట్‌లోకి లాంచ్ అయిన వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తుంది. దీంతోపాటు అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్ పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం అమెజాన్‌లో వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ (OnePlus Nord CE 3 Lite) స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియన్స్, గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో అందుబాటులోకి వచ్చింది. 8జిబి ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ అమెజాన్‌లో MRP ధర రూ. 19,999లకు లభిస్తుంది. దీంతోపాటు ఈ మొబైల్‌ను మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేక డీల్ లో భాగంగా దాదాపు 10 శాతం తగ్గింపుతో కేవలం రూ. 17,999కే లభిస్తోంది. అయితే ఈ మొబైల్ బ్యాంక్ ఆఫర్స్ లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.1,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ. 1,200 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోను రూ. 16,999కే పొందవచ్చు. 

దీంతో పాటు ఈ వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ (OnePlus Nord CE 3 Lite)  మొబైల్ పై అదనంగా తగ్గింపు పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ ను పొందడానికి ముందుగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ. 16,950 వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఆదనంగా బోనస్ కూడా లభిస్తుంది. ఇలా అన్ని డిస్కౌంట్స్ పోను ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 1,040కే లభిస్తోంది. అయితే ఈ మొత్తం బోనస్ పొందాలనుకునే వారు చేసే క్రమంలో ప్రీమియం బ్రాండ్ కలిగిన మొబైల్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా దాని కండిషన్ పై కూడా ఆధారపడి ఉంటుంది.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ టాప్ ఫీచర్స్:
డిస్ప్లే:

6.58-అంగుళాల FHD+ LCD డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
240Hz టచ్ శాంప్లింగ్ రేట్

ప్రాసెసర్:
Qualcomm Snapdragon 695 చిప్‌సెట్
6GB/8GB RAM
128GB/256GB స్టోరేజ్

కెమెరాలు:
108MP ప్రధాన కెమెరా
2MP డెప్త్ సెన్సార్
2MP మాక్రో కెమెరా
16MP సెల్ఫీ కెమెరా

బ్యాటరీ:
5000mAh బ్యాటరీ
67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

ఇతర ఫీచర్స్:
5G కనెక్టివిటీ
ఆండ్రాయిడ్ 12
OxygenOS 12.1
ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
3.5mm హెడ్‌ఫోన్ జాక్

ప్రత్యేకతలు:
120Hz రిఫ్రెష్ రేట్ తో మృదువైన డిస్ప్లే అనుభవం
శక్తివంతమైన Snapdragon 695 చిప్‌సెట్
అద్భుతమైన ఫోటోల కోసం 108MP ప్రధాన కెమెరా
67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More