Home> టెక్నాలజీ
Advertisement

Oneplus 10 pro: అద్భుత ఫీచర్లు కలిగిన వన్‌ప్లస్ 10 ప్రోపై భారీ డిస్కౌంట్, ధర ఎంతంటే

Oneplus 10 pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ కస్టమర్లకు గుడ్‌న్యూస్. OnePlus 10 Pr ధర ఒక్కసారిగా తగ్గింది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ కావడంతో క్రేజ్ పెరుగుతోంది.

Oneplus 10 pro: అద్భుత ఫీచర్లు కలిగిన వన్‌ప్లస్ 10 ప్రోపై భారీ డిస్కౌంట్, ధర ఎంతంటే

OnePlus 10 Pro అనేది వన్‌ప్లస్ కంపెనీకు చెందిన పాపులర్ స్మార్ట్‌ఫోన్. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం. అందుకే చాలామంది ఈ ఫోన్‌ను ఇష్టపడుతుంటారు. ఇప్పుడీ స్మార్ట్‌ఫోన్ ధర ఒక్కసారిగా తగ్గిపోయింది. ఆ వివరాలు మీ కోసం..

OnePlus 10 Pro స్మార్ట్‌ఫోన్ ఇండియాలో భారీగా తగ్గింపు ఉంది. ఈ ఏడాది మార్చ్ నెలలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ర్యామ్, స్టోరేజ్‌పరంగా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. OnePlus 10 Pro అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌లలో 5000 రూపాయలు చౌకగా లభిస్తోంది. కంపెనీ ఇప్పుడు OnePlus 11 లాంచ్ కోసం ఏర్పాట్లు చేస్తోంది. 

OnePlus 10 Proపై 5 వేల రూపాయల డిస్కౌంట్

OnePlus 10 Pro స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 66,999 రూపాయలకు లాంచ్ అయింది. అటు 12జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర 71,999 రూపాయలకు లాంచ్ అయింది. రెండు వేరియంట్లపై ఇప్పుుడు 5000 రూపాయలు డిస్కౌంట్ అందుతోంది.

Buds Z2పై కూడా డిస్కౌంట్

అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేసే కస్టమర్లకు ఎక్స్చేంజ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ కంపెనీ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేస్తే Buds Z2 అనేది  2,299 రూపాయలు, బడ్స్ ప్రో అయితే 5,499లకు లభిస్తుంది.

OnePlus 10 Pro ప్రత్యేకతలు

OnePlus 10 Proలో 7.78 ఇంచెస్ క్యూహెచ్‌డి ప్లస్ క్వాడ్ ఎమోల్డ్ డిస్‌ప్లే ఎల్టీపీవో 2.0, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రోసెసర్‌తో  12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కలిగి ఉంది. డివైస్‌లో 80 వాట్స్ వైర్డ్, 50 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీంతోపాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ , 8 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్ ట్రిపుల్ రేర్ కెమేరా ఉంది.

Also read: NPS scheme: రూ.150 పెట్టుబడి పెడితే.. మీరు కోటీశ్వరులే.. ఇవిగో మార్గాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More