Home> టెక్నాలజీ
Advertisement

Virus Threat: ఎస్బీఐ సహా 18 బ్యాంకులకు పొంచి ఉన్న కొత్త వైరస్, మీ ఫోన్ స్క్రీన్ రికార్డ్ అవుతుంది జాగ్రత్త

Virus Threat: ఆన్‌లైన్ బ్యాంకింగ్ విధానం ప్రారంభమైనప్పటి నుంచి కొత్త కొత్త సవాళ్లు, సమస్యలు ఎదురౌతున్నాయి. ఎక్కౌంట్ హ్యాక్ భయం వెన్నాడుతోంది. ఇప్పుడు మరో కొత్త ముప్పు వెంటాడుతోంది. ఆ వివరాలు మీ కోసం.

Virus Threat: ఎస్బీఐ సహా 18 బ్యాంకులకు పొంచి ఉన్న కొత్త వైరస్, మీ ఫోన్ స్క్రీన్ రికార్డ్ అవుతుంది జాగ్రత్త

టెక్నాలజీ పెరిగే కొద్దీ సేవలు సులభతరమౌతున్నా..హ్యాకింగ్, ఫ్రాడ్ భయాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ పరిస్థితి దారుణంగా మారింది. దేశంలోని ప్రముఖ బ్యాంకులకు ఇప్పుడు మరో కొత్త ముప్పు భయపెడుతోంది

ఇండియాలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ జోరందుకుంటోంది. అదే సమయంలో కొత్త కొత్త ప్రమాదాలు ఎదుర్కోవల్సి వస్తుంది. దేశంలోని ప్రముఖ బ్యాంకులకు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్స్ రికార్డింగ్ సమస్యగా మారుతోంది. ఎస్బీఐ సహా 18 బ్యాంకుల కస్టమర్లు అప్రమత్తం కాకతప్పదు. ఈ కొత్త వైరస్ పేరు డ్రినిక్. ఇప్పటికే చాలామంది  ఈ వైరస్ బారినపడ్డారు. కస్టమర్ల ప్రైవేటు వివరాలు చోరీ అవుతుండటంతో ఆందోళన పెరుగుతుంది. ఈ వైరస్ మీ స్మార్ట్‌ఫోన్లలో చొరబడి..మీ బ్యాంకింగ్ డీటైల్స్ సహా ఇతర వివరాలు చోరీ అవుతున్నాయి.

ఈ వైరస్ ద్వారా దొంగిలించిన సమాచారంతో హ్యాకర్లు కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. చాలామంది ఎక్కౌంట్ల నుంచి లక్షలాది రూపాయలు మాయమైపోతున్నాయి కూడా. ఎస్బీఐ సహా దేశంలోని 18 ప్రముఖ బ్యాంకు కస్టమర్లకు ఈ వైరస్ ముప్పు పొంచి ఉంది. వారికి సంబంధించిన వ్యక్తిగత వివరాలకు ప్రమాదం ఏర్పడింది. ఈ వైరస్ పేరు Drinik Android trojan యూజర్లకు అతిపెద్ద ప్రమాదకారి. దీన్నించి రక్షించుకోకపోతే మీ బ్యాంక్ ఎక్కౌంట్లపై హ్యాకర్లు దాడి చేస్తారు.

మీ స్మార్ట్‌ఫోన్ నుంచి మీ వ్యక్తిగత వివరాల్ని ఈ వైరస్ దొంగిలిస్తుంది. మీ ప్రైవేట్ ఫోటోలు, వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ అన్నీ చోరీ అవుతాయి. ఈ వివరాలన్నీ నేరుగా హ్యాకర్ల చేతికి చిక్కుతాయి. మీ బ్యాంక్ ఎక్కౌంట్‌తో పాటు సోషల్ మీడియా ఎక్కౌంట్లు కూడా హ్యాక్ అవుతుంటాయి. ఈ వైరస్ మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను రికార్డ్ చేస్తుంది.  అందుకే అవసరం లేని యాప్స్ మీ ఫోన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయవద్దు. మీకు తెలియకుండానే మీ ఫోన్ హ్యాక్ కావచ్చు. యాప్స్, మెస్సేజెస్, బ్లూ లింక్స్ ద్వారా మరే మార్గంలోనైనా మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అవుతుంది. మీ ఫోన్లకు వచ్చే బ్లూ లింక్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.

Also read: DA Hike For Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒకేసారి భారీ మొత్తం ఖాతాల్లోకి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More