Home> టెక్నాలజీ
Advertisement

Moto G85 Launch: ప్రీమియం ఫీచర్లతో అతి తక్కువ ధరకే లాంచ్ అయిన Moto G85

Moto G85 Launch: ప్రముఖ టెక్ దిగ్గజం మోటో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఫోన్స్ లాంచ్ చేసే మోటోరోలా ఇప్పుడు మరోసారి హల్‌చల్ చేస్తోంది. కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్‌ను చాలా తక్కువ ధరకే లాంచ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Moto G85 Launch: ప్రీమియం ఫీచర్లతో అతి తక్కువ ధరకే లాంచ్ అయిన Moto G85

Moto G85 Launch: మోటోరోలా కంపెనీ నుంచి కొత్తగా Moto G85 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఊహించని ఫీచర్లతో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోన్ ఇతర ప్రీమియం ఫోన్లకు గట్టి షాక్ ఇవ్వనుంది. ధర కూడా ఇతర ఫోన్లతో పోలిస్తే చాలా తక్కువ. Moto G85 5G ధర, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ పోల్డ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇందులో 10 బిట్ డిస్‌ప్లే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కలిగి ఉండటంతో ప్రమాదవసాత్తూ ఎలాంటి స్క్రాచెస్ పడవు. ఈ ఫోన్ క్వాల్‌కామ్ 6ఎస్ జనరేషన్ 3 ప్రోసెసర్‌తో ఆండ్రాయిడ్ 14 ఆధారగా పనిచేస్తుంది. ఇందులో ఓఎస్ అప్‌డేట్స్ రెండేళ్లు, సెక్యూరిటీ అప్‌డేట్స్ మూడేళ్ల పాటు కంపెనీ అందిస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పనిచేస్తుంది. 1600 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఇందులో 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ వెర్షన్ ఉంది. కనెక్టివిటీ విషయానికొస్తే బ్లూటూత్ , వైఫై కనెక్ట్ అయున్నాయి. 

ఇందులో డ్యూయల్ కెమేరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమేరా ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా అమర్చారు. Moto G85 5Gలో 8జీబీ ర్యామ్ అయితే 17,999 రూపాయలకు, 12 జీబీ ర్యామ్ అయితే 19,999 రూపాయలకు అందుబాటులో ఉండనుంది. కోబాల్ట్ బ్లూ, అర్బన్ గ్రే, ఆలివ్ గ్రీన్ రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్ జూలై 16 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో రానుంది. ఇన్‌స్టంట్ బ్యాంక్ లాంచ్ ఆఫర్ కింద 1000 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. 

Also read: Lava Blaze X: 64MP AI సోనీ కెమేరాతో Lava Blaze X లాంచ్, ధర, ఇతర ఫీచర్లు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More