Home> టెక్నాలజీ
Advertisement

iPhone Price Drop Alert: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో ధరల్లో భారీ తగ్గింపు

iPhone Price Drop Alert: ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త. ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రోల ధరలు మరింతగా తగ్గాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో బారీ డిస్కౌంట్ లభిస్తోంది. 

iPhone Price Drop Alert: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో ధరల్లో భారీ తగ్గింపు

యాపిల్ ఐఫోన్ కొనాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. యాపిల్ ఐఫోన్ 13పై ఇప్పుడు ఈ కామర్స్ వేదికలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు భారీ డిస్కౌంట్ ప్రకటించాయి. ఆ ధరల వివరాలు ఇలా ఉన్నాయి

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉంటోంది. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా రోజువారీ జీవితంలో చాలా పనులు ఆ స్మార్ట్‌ఫోన్‌తోనే జరుగుతున్నాయి. అదే సమయంలో వినియోగదారులకు కూడా చాలా రకాల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కాస్త విభిన్నమైంది, స్టేటస్ సింబల్‌గా చెప్పుకునేది ఐఫోన్.

ఫెస్టివల్ సీజన్‌లో వివిధ ఈ కామర్స్ వేదికలపై కూడా యాపిల్ ఐఫోన్‌కు భారీగా డిమాండ్ ఏర్పడిందని తెలుస్తోంది. మీరు కూడా ఐఫోన్ కొనాలని అనుకుంటే..ఇదే మంచి అవకాశం. ఐఫోన్ 13 ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌కు అందుబాటులో ఉంది. 

ఐఫోన్ 13లో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 2021లో 79,900 కు లాంచ్ అయింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ 66,990 రూపాయలకు లభిస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్ సైతం ఎక్స్చేంజ్ ధర 18,500 రూపాయలు అందిస్తోంది. ఇది కాకుండా..సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా మరో పది శాతం తక్షణ డిస్కౌంట్ ఇస్తోంది. ఎక్స్చేంజ్ ధర ప్రకారం ఐఫోన్ 13 కేవలం 48,490 రూపాయలకు లభించనుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్చేంజ్ ధర 18,500 రూపాయలుంది. ఐఫోన్ 13 ప్రో 128 జీబీ వేరియంట్ గరిష్ట ధర 1,19,900 రూపాయలుంది. ఎక్స్చేంజ్ అనంతరం ఈ ఫోన్ 1,01,400 రూపాయలకు లభించనుంది. మరికొన్ని బ్యాంక్ ఆఫర్లు కలుపుకుంటే లక్షలోపే ఈ ఫోన్ లభిస్తుంది.

అమెజాన్ ఐఫోన్ 13 ప్రోను 14,050 రూపాయల ఎక్స్చైంజ్ ధరతో 1,09,900 రూపాయలకు అందిస్తోంది. 

Also read: Jio plans: జియో నుంచి ఇప్పుడు అత్యంత చౌక ప్లాన్, కేవలం 75 రూపాయలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More