Home> టెక్నాలజీ
Advertisement

Flipkart Sale: 50MP కెమేరా, 6GB Ram Poco M6 Pro ఫోన్ కేవలం 10 వేలకే, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్

Flipkart Sale: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఎండ్ ఆఫ్ ది సీజన్ సేల్ 2024 లో భాగంగా కొన్ని రకాల బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఆ వివరాలు మీ కోసం.

Flipkart Sale: 50MP కెమేరా, 6GB Ram Poco M6 Pro ఫోన్ కేవలం 10 వేలకే, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ ది సీజన్ సేల్ 2024 జూన్ 1న ప్రారంభమైంది. ఇందులో భాగంగా కొన్ని రకాల స్మార్ట్‌ఫోన్లపై ఏకంగా 50 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. ఇటీవలి కాలంలో అత్యధికంగా విక్రయమౌతున్న పోకో స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Pocoకు చెందిన Poco M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకే లభ్యమౌతోంది. ఈ ఫోన్ 6.70 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 550 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ గరిష్టంగా 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ఉంటుంది. ప్రత్యేక ఎస్‌డి కార్డు ద్వారా స్టోరేజ్ మరింతగా పెంచుకోవచ్చు. ఇక ఐపీ 53 రేటింగ్ కలిగిన యాంటీ డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లు కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 5జి బ్లూటూత్, వైఫై 6 సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ అయితే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 

ఈ ఫోన్‌లో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. కెమేరా అయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్ సందర్భంగా Poco M6 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా 41 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దాంతో 6జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ కెమేరా కలిగిన ఈ ఫోన్ కేవలం 9,999 రూపాయలకే పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు కార్డు ఉంటే అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ ది సీజన్ సేల్ 2024 జూన్ 12 వరకే నడుస్తుంది. 

Also read: Flipkart Smartphone Offers: 12జీబీ ర్యామ్, 108MP కెమేరా ఫోన్ కేవలం 15 వేలకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More