Home> టెక్నాలజీ
Advertisement

Apple watch series 10: స్లీప్ ఆప్నియాను గుర్తించే కెపాసిటీ..అద్భుతమైన ఫీచర్లతో యాపిల్ వాచ్..!

Apple glow time event 2024: తాజాగా యాపిల్ సంస్థ.. యాపిల్ వాచ్ సీరీస్ 10 ను  మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇందులో స్లీప్ ఆప్నియాను గుర్తించే ఫీచర్ కూడా అమర్చడం గమనార్హం. ఆస్తమా రోగులకు ఈ వాచ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

Apple watch series 10: స్లీప్ ఆప్నియాను గుర్తించే కెపాసిటీ..అద్భుతమైన ఫీచర్లతో యాపిల్ వాచ్..!

Apple watch series 10 detects sleep: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా "ఇట్స్ గ్లో టైమ్" ఈవెంట్ లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, యాపిల్ ఎయిర్ పాడ్ 4 ను లాంచ్ చేసింది. తాజాగా ఈ ఈవెంట్లో యాపిల్ వాచ్ సిరీస్ 10ను.. ముందుగా లాంచ్ చేసింది ఈ సంస్థ. ఈ సిరీస్ లో పలు అడ్వాన్స్డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. గత వాచ్ లతో పోల్చుకుంటే, ఈ వాచ్ ల డిస్ప్లే లు కాస్త.. పెద్దవిగా ఉన్నాయి.  వైడ్ యాంగిల్ ఓఎల్ఈడి డిస్ప్లే ని కూడా అమర్చారు. ఐ ఫోన్ వాచ్ సీరీస్ 9 తో పోల్చుకుంటే ఈ సీరీస్ 10 డిస్ప్లే పెద్దగా.. ఉండడంతో పాటు సన్నగా.. చాలా స్టైలిష్ గా కూడా ఉంటుంది.

వాచ్ సరికొత్త ఫీచర్స్: 

ఈ వాచ్  అల్యూమినియం, పాలిష్డ్  టైటానియం ఫినిష్ తో వస్తోంది. చాలా తేలికగా కూడా ఉంటుంది. ముఖ్యంగా S10 చిప్ తో పనిచేసే ఈ సిరీస్ లో స్లీప్ ఆప్నియా ఫీచర్ ఉంది. నిద్రలో శ్వాస సంబంధిత ఆటంకాలను కూడా ఇది గుర్తిస్తుంది. 

సీరీస్ 9 తో పోల్చుకుంటే ఈ సిరీస్ 10  వేగంగా చార్జ్ అవ్వడమే కాదు 30 నిమిషాల్లో 80% చార్జింగ్ పూర్తి అవుతుంది. 

వాచ్ ధర: 

జీపీఎస్ ధర 399 డాలర్లుగా కంపెనీ స్పష్టం చేసింది.  జీపీఎస్ ప్లస్ సెల్యులార్ ధర 499 డాలర్లుగా ప్రకటించగా, అల్ట్రా 2  ధర 799 డాలర్లుగా ప్రకటించారు.ఇలాంటి అద్భుతమైన ఫీచర్లతో యాపిల్ స్మార్ట్ వాచ్ లు మార్కెట్లోకి అందుబాటులోకి రావడం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ముఖ్యంగా ఈ యాపిల్ వాచ్ లు ఎప్పటికప్పుడు.. వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులను తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది తమకు తెలియని ఎన్నో రోగాలను కూడా ఈ వాచ్ లు కనుగొన్నాయని స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు యాపిల్ వాచ్ సీరీస్ 10 లో అమర్చిన ఈ కొత్త 
స్లీప్ ఆప్నియాను ఫీచర్ ఆస్తమా పేషంట్లకు.
 మరింత ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

Also Read: AP Debts: మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ అప్పులు అర లక్ష కోట్లు.. బాబు పాలనలో భారీగా అప్పులు

Also Read: Munneru Swimmng: మద్యంమత్తులో మున్నేరు నదిలో దూకిన యువకులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Read More