Home> టెక్నాలజీ
Advertisement

iOS 18 Features: ఐఫోన్‌లో కొత్త ఫీచర్, ఇకపై టెక్స్ట్ మెస్సేజ్ కూడా షెడ్యూల్ చేయవచ్చు

iOS 18 Features: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఇకపై 5 అద్భుతమైన ఫీచర్లు లభించనున్నాయి. ఐవోఎస్ 18 అప్‌డేట్ జారీ అయింది. ఈ అప్‌డేట్ ద్వారా ఎలాంటి ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయో తెలుసుకుందాం.

iOS 18 Features: ఐఫోన్‌లో కొత్త ఫీచర్, ఇకపై టెక్స్ట్ మెస్సేజ్ కూడా షెడ్యూల్ చేయవచ్చు

iOS 18 Features: ఆపిల్ సంస్థ ప్రతి యేటా నిర్వహించే వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024లో  సరికొత్త ఐవోఎస్ 18 అప్‌డేట్ ఆవిష్కరించింది. కంట్రోల్ సెంటర్‌కు సంబంధించి కీలకమైన మార్పు కన్పించనుంది. యూజర్లకు అనిర్వచనీయమైన అనుభూతి కలగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఐవోఎస్ 18 సాఫ్ట్‌వేర్‌లో కంట్రోల్ సెంట్రల్ విషయంలో కీలకమైన అప్‌డేట్ ఇది. ఇందులో మ్యూజిక్,యాప్స్ విషయంలో మరింత కంట్రోల్ లభిస్తుంది యూజర్లకు. బటన్స్, లేఅవుట్, ఆకారాన్ని మార్చుకోవచ్చు. కొత్త కంట్రోల్ సెంట్రల్‌లో చాలా పేజీలుంటాయి. మీకు నచ్చినట్టుగా వాటిని మార్చుకోవచ్చు. కొత్త కంట్రోల్ గ్యాలరీ కూడా ఉంది. దీని ద్వారా ధర్డ్ పార్టీ యాప్ కంట్రోల్ చేయవచ్చు. లాక్ స్క్రీన్‌ను మరింత సౌలభ్యంగా కస్టమైజ్ చేసింది కంపెనీ. ఫ్లాష్ లైట్, కెమేరా కంట్రోల్ మార్చుకోవచ్చు. ఇప్పటివరకూ ఇది డీఫాల్ట్ మోడ్‌లో ఉంది. 

ఐవోఎస్ 18లో ఫోటో యాప్‌లో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త లే అవుట్ మీ లైబ్రరీ, గ్రిడ్‌ను ఒకే స్క్రీన్‌పై ఉంచుతుంది. ఇందులో ఫిల్టర్, టైమ్ స్కేల్ మీ ఫోటోల్ని సెర్చ్ చేసేందుకు దోహదం చేస్తుంది. కలెక్షన్ వ్యూ అనేది మీ ఫోటోల ట్రిప్ లేదా వెకేషన్ థీమ్ ప్రకారం సెట్ అవుతుంటాయి. దాంతోపాటు స్క్రీన్ షాట్ ఫిల్టరేషన్ ఉంటుంది. 

ఇందులో అన్నింటికంటే కీలకమైంది టెక్స్ట్ మెస్సేజ్ విషయంలో. టెక్స్ట్ మెస్సేజ్ టైప్ చేసి పెట్టుకుని మీరెప్పుడు కావలిస్తే అప్పుడు పంపించేట్టు షెడ్యూల్ చేసుకోవచ్చు. మెస్సేజ్ రియాక్ట్ అయ్యేందుకు కూడా ఏదైనా ఈమోజీ లేదా స్టిక్కర్ ఉపయోగించవచ్చు. మెస్సేజ్‌ను బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్ లేదా స్ట్రైక్ త్రూ వంటి ఫార్మట్‌లో రాయవచ్చు. దాంతోపాటు కొన్ని ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే వర్డ్స్ మీ స్క్రీన్‌పై కదులుతూ కన్పిస్తాయి.

ఐఫోన్‌లో కన్పించే సఫారీ ఇప్పుడు వెబ్‌పేజ్‌పై కీలకమైన సమాచారం, దిశా నిర్దేశం, మ్యూజిక్, సినిమాలు, టీవీ షోలు దానికవే హైలైట్ అయి కన్పిస్తాయి.

Also read: Platelet Count: డెంగ్యూ రోగులకు ఈ 5 పండ్లు దివ్య ఔషధంతో సమానం, ప్లేట్‌లెట్ కౌంట్ పెంచే అద్భుత మార్గం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More