Home> టెక్నాలజీ
Advertisement

Apple iPhone: రూ.20 వేల లోపే ఐఫోన్.. ఎగబడి కొంటున్న జనం! ఇంత చౌకగా ఇదే తొలిసారి

Apple iPhone 12 Mini buy only Rs 19999 in Flipkart. ఐఫోన్ 12 మినీని ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 20,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫోన్ ఇంత చౌకగా అందుబాటులో ఉండడం ఇదే తొలిసారి.
 

Apple iPhone: రూ.20 వేల లోపే ఐఫోన్.. ఎగబడి కొంటున్న జనం! ఇంత చౌకగా ఇదే తొలిసారి

Apple iPhone 12 Mini buy only Rs 19999 in Flipkart: భారత దేశంలో ఐఫోన్‌కు చాలా క్రేజ్ ఉంది. ప్రస్తుత రోజుల్లో యువతతో పాటు పెద్దవారు కూడా తన జేబులో ఐఫోన్ ఉండాలని కోరుకుంటున్నారు. అయితే మిగతా ఫోన్‌ల కంటే.. ఐఫోన్ ధర ఎక్కువగా ఉండటంతో ఎవరూ కొనలేకపోతున్నారు. అయితే పలు సేల్స్  సందర్భంగా ఐఫోన్‌ల ధరలు భారీగా తగ్గాయి. నేడు ఐఫోన్ 12 మినీ (iPhone 12 Mini)ని ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 20,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫోన్ ఇంత చౌకగా అందుబాటులో ఉండడం ఇదే తొలిసారి.

ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్‌లో భాగంగా కంపెనీ ప్రారంభించిన మొదటి మినీ మోడల్ 'ఐఫోన్ 12 మినీ' (Apple iPhone 12 Mini) అన్న విషయం తెలిసిందే. ఈ ఫోన్ పరిమాణం చిన్నదే అయినా ఫీచర్లు మాత్రం బాగా ఉన్నాయి. ఐఫోన్ 12 మినీని చౌకగా ఎలా కొనుగోలు చేయవచ్చో ఇప్పుడు చూద్దాం. 

ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్: 
ఐఫోన్ 12 మినీ ఫోన్ ప్రారంభ ధర రూ. 59,900. కానీ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో 35% తగ్గింపు ఆఫర్ ఉంది. దాంతో ఈ ఫోన్ రూ. 38,499లకు లభిస్తోంది. ఇక బ్యాంక్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ల అనంతరం ఈ ఫోన్ ధర భారీగా తగ్గుతుంది.

బ్యాంక్ ఆఫర్:
మీరు Apple iPhone 12 miniని కొనుగోలు చేయడానికి కోటక్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. రూ. 1000 తగ్గింపు లభిస్తుంది. దాంతో ఈ ఫోన్ రూ.37,499 లకు అందుబాటులో ఉంది. 

ఎక్స్‌ఛేంజ్:
Apple iPhone 12 mini పై రూ.17,500 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే.. ఇంత మొత్తం లభిస్తుంది. అయితే మీ ఫోన్ కండిషన్ బాగుండి, సరికొత్త మోడల్ అయినప్పుడు మాత్రమే రూ.17,500 ఎక్స్‌ఛేంజ్ తగ్గింపు లభిస్తుంది. మీరు పూర్తి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పొందితే.. ఈ ఫోన్ ధర రూ. 19,999 అవుతుంది. 

Also Read: Venus Transit 2022: 2022లో చివరి సంచారం.. ఈ 4 రాశుల వారి జీవితంలో అల్లకల్లోలం! జాగ్రత్తగా ఉండాల్సిందే  

Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు భారీ షాక్.. రూ. 50 వేల మార్క్ దాటేసిన పసిడి ధరలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Read More