Home> టెక్నాలజీ
Advertisement

Apple iPhone 15 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Apple iPhone 15 మొబైల్‌పై అదిపోయే డిస్కౌంట్‌ ఆఫర్‌.. ఎగబడి కొంటున్న జనాలు!


Apple iPhone 15 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Apple iPhone 15 స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Apple iPhone 15 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Apple iPhone 15 మొబైల్‌పై అదిపోయే డిస్కౌంట్‌ ఆఫర్‌.. ఎగబడి కొంటున్న జనాలు!

 

Apple iPhone 15 Price Cut: యాపిల్ స్మార్ట్‌ఫోన్స్‌ అంటే ఇష్టపడని వారు ఉండరు. యువత ఎంతో ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ధరల విషయానికొస్తే, అన్ని స్మార్ట్‌ఫోన్స్‌ కంటే కొంత ఎక్కువే.. ఈ మొబైల్స్‌ అన్ని ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన డిజైన్‌తో లాంచ్‌ అవుతూ ఉంటాయి. యాపిల్ కంపెనీ ఇటీవలే 16 సిరీస్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్స్‌ కూడా ప్రీమియం ఫీచర్స్‌తో పాటు మిడిల్‌ రేంజ్‌ బడ్జెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే యాపిల్ కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకుని గతంలో లాంచ్‌ చేసిన 15, 14 సిరీస్‌లపై భారీగా ధరలను తగ్గించింది. ముఖ్యంగా కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌తో అందిస్తోంది.

ముఖ్యంగా యాపిల్ కంపెనీ గతంలో విడుదల చేసిన 15 సిరీస్‌ మొబైల్స్‌పై ఏకంగా రూ.10 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా 128 GB స్టోరేజ్‌ వేరియంట్స్‌పై అదనపు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో Apple iPhone 15 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ మొబైల్‌పై  12 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ (128 GB) ధర రూ.79,600తో అందుబాటులో ఉంది. 

యాపిల్ ఈ Apple iPhone 15 స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.69,999కే లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. వీటిని వినియోగించాలనుకునేవారు ముందుగా ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి రూ.2000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను కేవలం రూ.67,999కే పొందవచ్చు.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌ పొందాలనుకునేవారు ముందుగా పాత యాపిల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.56,350 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను కేవలం రూ.13,649కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ యాపిల్ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర స్పెషల్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని తెలుసుకోవడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
    

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More