Home> టెక్నాలజీ
Advertisement

Amazon Offers: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఇవాళే లాస్ట్, OnePlus Nord CE3పై భారీ డిస్కౌంట్

Amazon Offers: ప్రస్తుతం ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో సమ్మర్ స్పెషల్ సేల్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా అన్ని రకాల బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా వన్‌ప్లస్ లేటెస్ట్ మోడల్ ఫోన్‌పై కూడా భారీగా తగ్గింపు లభిస్తోంది. 

Amazon Offers: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఇవాళే లాస్ట్, OnePlus Nord CE3పై భారీ డిస్కౌంట్

Amazon Offers: అమెజాన్‌లో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 నడుస్తున్నాయి. మరో రెండ్రోజుల్లో సమ్మర్ స్పెషల్ సేల్స్ ముగియనున్నాయి. అందుకే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే ఆలోచన ఉంటే వెంటనే త్వరపడండి. ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై ఊహించని తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో OnePlus Nord CE3పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 

OnePlus Nord CE3 అనేది వన్‌ప్లస్ నుంచి మార్కెట్‌లో వచ్చిన లేటెస్ట్ ఫోన్. ఈ ఫోన్ 6.7 ఇంచెస్ ఎమోల్డ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.  2412 x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగిన ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 782 జీ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. సెక్యూరిటీ పరంగా చూస్తే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌‌తో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంది. ఇక 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ ఉంది. 

ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరాతో పాటు సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. సోనీ ఐమ్యాక్స్ 3555 కెమేరా కావడంతో రిజల్యూషన్, క్లారిటీ అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్ అసలు ధర 27 వేలు కాగా ఇప్పుడు ప్రత్యేక డిస్కౌంట్ అనంతరం కేవలం 19 వేలకే లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 మే 9వ వరకూ ఉంటే...అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024 మాత్రం ఇవాళ మే 7తో ముగియనుంది. 

Also read: Ooty-Kodaikanal Tour: ఇక ఊటీ, కొడైకెనాల్ వెళ్లాలంటే అనుమతి ఉండాల్సిందే, ఎవరిస్తారు, ఎలా తీసుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More