Home> టెక్నాలజీ
Advertisement

Amazon Sale 2023: టీవీ కొనాలనుకుంటున్నారా ..? అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్స్ మీ కోసమే

అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే!  అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు గ్రేట్ ఇండియా ఫెస్టివల్ నడవనుంది. ఇప్పటికే ఈ సేల్ ను చాలా మంది వినియోగించుకున్నారు. గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఉన్న ఆఫర్లు.. వాటి వివరాలు.. 

Amazon Sale 2023: టీవీ కొనాలనుకుంటున్నారా ..? అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్స్ మీ కోసమే

Amazon Sale 2023: ప్రముఖ ఈ కామర్స దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌ను అక్టోబర్ 8 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఈ ఆఫర్లో మొబైల్స్, టీవీలు, లాప్‌టాప్స్, ఫ్యాషన్, హోమ్, ఎలక్ట్రానిక్స్, బుక్స్ ఇలా అనేక వస్తువులపై డిస్కౌంట్లు లభించనున్నాయి. ఇప్పటికే చాలామంది ఈ ఆఫర్‌ను వినియోగించుకుంటున్నారు. అయితే ఇందులో అమెజాన్ 4కే, 8కే లాంటి టీవీలకు భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది.

ఇప్పటికే చాలామంది స్మార్ట్ టీవీలనే వాడుతున్నారు. మంచి క్వాలిటీ విజువల్స్, ఆడియో సిస్టమ్స్ లాంటి వాటికోసం నెటీజన్లు ఇలాంటి టీవీల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ తమ డిస్కౌంట్లతో నెటీజన్లన ఆకట్టుకుంటోంది. ఎల్‌జీ, ఏసెర్, ఎంఐ, రెడ్‌మీ, వన్ ప్లస్, టీసీఎల్ లాంటి బ్రాండెడ్ టీవీలు ఏకంగా 64 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి.  మీరు ఓ మంచి స్మార్ట్ టీవీని కొనాలనుకుంటే ఈ అవకాశాన్ని మిస్ కాకండి. ఎలాంటి టీవీలకు ఆఫర్లు ప్రకటించారో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. టీసీఎల్  బిజెల్-లెస్ ఎస్ సీరీస్ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్‌ఈడీ టీవీ
ఈ టీవీ ఎత్తు 101 సెం.మీ ( 40 అంగుళాలు ). ధర రూ.22,999. ఈ స్మార్ట్ టీవీ  ఆధునాతన సాంకేతికతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్స్, గూగుల్ వాయిస్ కంట్రోల్ ఫంక్షన్స్,  ఫుల్ హెచ్‌డీ ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి. అలాగే ఇందులో డాల్బీ ఆడియో టెక్నాలజీని కూడా ఉంది. 

2. రెడ్‌మీ 4కే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ 
108 సెం.మీ (43 అంగుళాలు) 4కే అల్ట్రా హెచ్‌డీ స్రీన్‌తో వస్తోంది. ధర రూ.21,999 ఇందులో యాప్స్, స్ట్రీమింగ్ సర్వీసెస్, గూగుల్ వాయిస్ కంట్రోల్ పీఛర్స్ ఇందులో ఉన్నాయి. అలాగే డాల్బీ విజన్ టెక్నాలజీ, 30 w డాల్బీ ఆడియో సిస్టమ్, హై క్వాలిటీ సౌండ్ లభించనుంది. 

3. iFFALCON 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్‌ఈడీ గూగుల్ టీవీ 
ఈ టీవీ 147 సెం.మీ (58 అంగుళాల) ఎత్తులో ఉంటుంది. ధర రూ.29,999.  యూప్స్, స్ట్రీమింగ్ సర్వీసెస్, 4కే అల్ట్రా హెచ్‌డీ పిక్చర్ క్వాలిటీ, గూగుల్ అసిస్టెంట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

4. ఎంఐ ఎక్స్ సిరీస్ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఆండ్రాయిట్ ఎల్‌ఈడీ టీవీ 
138 సెం.మీ (55 అంగుళాలు ) ఎత్తులో ఈ స్మార్ట్ టీవీ వస్తోంది. ధర రూ.34,990. యాప్స్, స్ట్రీమింగ్ సర్వీసెస్, గూగుల్ అసిస్టెంట్, 4కే ఆల్ట్రా హెచ్‌డీ రెసొల్యూషన్, మంచి సౌండ్ క్వాలిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

Also Read: Chandrabau Case: చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంలో విచారణ శుక్రవారానికి వాయిదా

5. ఏసెర్ ఐ సిరీస్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్‌ఈడీ గూగుల్ టీవీ 
ఈ టీవీ ఎత్తు 127 సెం.మీ (50 అంగుళాలు). ధర రూ.27,999 యాప్స్, స్ట్రీమింగ్ సర్వీసెస్, గూగుల్ వాయిస్ కంట్రోలర్, 4కే అల్ట్రా హెచ్‌డీ రెసొల్యూషన్, హై క్వాలిటీ సౌండ్ ఫీచర్లతో ఈ టీవీ అందుబాటులో ఉంది. 

6. ఎల్‌జీ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ
దీని ఎత్తు 80 సెం.మీ (32 అంగుళాలు ). ధర రూ.13,940. యూప్స్, స్ట్రీమింగ్ సర్వీసెస్, హై క్వాలిటీ సౌండ్ టెక్నాలజీ, హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

7. వన్ ప్లస్ వై సిరీస్ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 
ఈ టీవీ 80 సెం.మీ (32 అంగుళాలు) ఎత్తులో ఉంటుంది. ధర రూ.12,499.  యాప్స్, స్ట్రీమింగ్ సర్వీసెస్, హెచ్‌డీ రెడీ రెసొల్యూషన్ పిక్చర్ క్వాలిటీ, హై క్వాలిటీ సౌండ్ ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి

8. ఎంఐ 5ఏ సిరీస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్‌ఈడీ టీవీ 
80 సెం.మీ (32 అంగుళాలు) ఎత్తులో ఈ టీవీ ఉంటుంది. ధర రూ.10,990.  యాప్స్, స్ట్రీమింగ్ సర్వీసెస్, హెచ్‌డీ రెడీ రిసొల్యూషన్, హై క్వాలిటీ సౌండ్ టెక్నాలజి ఫీచర్లు లభించనున్నాయి. 

9. రెడ్‌మీ 4కే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ 
ఈ టీవీ ఎత్తు 103 సెం.మీ (43 అంగుళాలు ). ధర రూ.21,999. డాల్బీ విజన్, 30W డాల్టీ ఆడియో, 4కే డిస్‌ప్లే, అధునాతన ఆడియో టెక్నాలజీ, డాల్బీ ఆడియో, హై క్వాలిటీ విజువల్స్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

Also Read: Oppo A2X Price: అతి తక్కువ ధరతో మార్కెట్‌లోకి Oppo A2X మొబైల్‌..ఫీచర్స్‌ వివరాలు ఇవే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Read More