Home> క్రీడలు
Advertisement

Ryan Burl: జింబాబ్వే బ్యాటర్‌ బర్ల్‌ పెను విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 34 రన్స్! చిరిగిన బూట్లతో..

Zimbabwe batter Ryan Burl hits 34 runs in single over. బంగ్లాదేశ్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్‌ ర్యాన్‌ బర్ల్‌ పెను విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 34 పరుగులు సాధించాడు.
 

Ryan Burl: జింబాబ్వే బ్యాటర్‌ బర్ల్‌ పెను విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 34 రన్స్! చిరిగిన బూట్లతో..

Zimbabwe batter Ryan Burl hits 34 runs in single over: సొంత గడ్డపై బంగ్లాదేశ్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్‌ ర్యాన్‌ బర్ల్‌ పెను విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 34 పరుగులు (6, 6, 6, 6, 4, 6) సాధించాడు. స్పిన్నర్‌ నసుమ్‌ అహ్మద్‌ వేసిన 15వ ఓవర్‌ మొదటి నాలుగు బంతులను సిక్సులుగా మలిచిన బర్ల్‌.. ఐదో బంతికి ఫోర్‌ బాదాడు. ఇక చివరి బంతికి మళ్లీ సిక్స్ బాదాడు. దీంతో బర్ల్‌ ఒకే ఓవర్‌లో 34 పరుగులు సాధించి.. అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 

భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ టీ20 ప్రపంచకప్ 2007లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 సిక్సులు బాదాడు. వెస్టిండీస్ వెటరన్ ప్లేయర్ కీరన్‌ పొలార్డ్‌.. 2021లో శ్రీలంక బౌలర్‌ అకిల ధనంజయ బౌలింగ్‌లో 36 పరుగులు రాబట్టాడు. పొలార్డ్‌ కూడా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదాడు. న్యూజిలాండ్‌ క్రికెటర్‌ టిమ్‌ సైఫర్ట్‌.. భారత యువ ప్లేయర్ శివమ్‌ దూబే బౌలింగ్‌లో 34 పరుగులు చేశాడు. ఇప్పుడు ర్యాన్‌ బర్ల్‌ కూడా 34 రన్స్ చేసి ఈ జాబితాలో దూబేతో సమానంగా నిలిచాడు. 

మూడో టీ20లో జింబాబ్వే 10 పరుగులతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. దాంతో సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. ర్యాన్‌ బర్ల్‌ (54), న్యూచీ (35) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసి ఓడిపోయింది. విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన ర్యాన్‌ బర్ల్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. తొలి రెండు టీ20ల్లో అర్ధ సెంచరీలు సాధించిన సికందర్‌ రాజా 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అందుకున్నాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆగస్ట్‌ 5 నుంచి ప్రారంభం కానుంది.

2021లో ర్యాన్‌ బర్లే ఓ ట్వీట్ చేసి అందరి పరిచయమయ్యాడు. తనకు స్పాన్సర్ లేరని, చిరిగిన బూట్లతో మ్యాచులు ఆడతున్నానని ట్విట్టర్‌లో ఒక ఫోటో పెట్టాడు. ఏదైనా కంపెనీ జింబాబ్వే జట్టుకు స్పాన్సర్ చేయాలని బర్లే కోరాడు. దాంతో ఓ పెద్ద షూ కంపెనీ జింబాబ్వే టీంకు స్పాన్సర్ చేసింది. మొత్తానికి బర్లే ట్వీట్ జింబాబ్వే జట్టుకు బూట్లు, కిట్‌లు తీసుకొచ్చింది. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌కు జింబాబ్వే అర్హత సాధించిన విషయం తెలిసిందే. 

Also Read: Bindu Madhavi: అలాంటిది నాకు వద్దు.. నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బింధు మాధవి!

Also Read: Fourth wave Scare: దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు... కొత్త కేసులు ఎన్నంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More