Home> క్రీడలు
Advertisement

చాహల్, కుల్దీప్‌పై యువరాజ్ సింగ్‌ కామెంట్స్.. దళిత్ రైట్స్ యాక్టివిస్ట్ ఫిర్యాదుతో కేసు నమోదు

యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు నమోదైంది ( Police case on Yuvraj Singh ). రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ చేసిన సందర్భంగా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌‌లను కులాన్ని ( Yuzvendra Chahal and Kuldeep Yadav ) కించపర్చేలా వారిపై పలు అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడనేది టీమిండియా మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌పై నమోదైన అభియోగం.

చాహల్, కుల్దీప్‌పై యువరాజ్ సింగ్‌ కామెంట్స్.. దళిత్ రైట్స్ యాక్టివిస్ట్ ఫిర్యాదుతో కేసు నమోదు

యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు నమోదైంది ( Police case on Yuvraj Singh ). రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ చేసిన సందర్భంగా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌‌లపై కులం పేరుతో ( Yuzvendra Chahal and Kuldeep Yadav ) ప్రస్తావిస్తూ వారిపై పలు అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడనేది టీమిండియా మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్పై నమోదైన అభియోగం. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లపై యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం చెందిన దళిత హక్కుల కార్యకర్త, న్యాయవాది అయిన రజత్ కల్సన్.. హర్యానాలోని హిసార్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు నెల రోజుల క్రితం లాక్ డౌన్ సమయంలో రోహిత్ శర్మ, యూవీల మధ్య జరిగిన లైవ్ చాట్‌లో ( Yuvaraj Singh live chat with Rohit Sharma ) యూవీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు కల్సన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. యూవీ చేసిన వ్యాఖ్యలు దళితుల మనోభావాలను కించపర్చేవిగా ఉన్నాయని కల్సన్.. అతడిని అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా రజత్ కల్సన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. చెస్ రారాజు విశ్వనాథన్ ఆనంద్‌కు 14 రోజుల క్వారంటైన్‌.. తర్వాతే ఇంటికి )

రోహిత్ శర్మదీ తప్పే..
యువరాజ్ సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం రోహిత్ శర్మను సైతం కల్సన్ విడిచిపెట్టలేదు. యువరాజ్ సింగ్ వ్యాఖ్యలను రోహిత్ శర్మ ( Rohit Sharma ) ఖండించకపోవడం కూడా పరోక్షంగా అతడి మాటలకు మద్దతిచ్చినట్టే అవుతుందని కల్సన్ మండిపడ్డారు.

యువి క్షమాపణలు చెప్పాలని నెటిజెన్స్ డిమాండ్.. 
రజత్ కల్సన్ ఫిర్యాదు సంగతి అలా ఉండగా... సోషల్ మీడియాలో సైతం యువరాజ్ సింగ్‌పై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తంచేశారు. యూవీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని దళితులకు క్షమాపణలు చెప్పాలని పలువురు నెటిజెన్స్ డిమాండ్ చేశారు. 

షాహీద్ అఫ్రిదీని ఖండించిన యువరాజ్ సింగ్.. 
భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఇటీవల పాకిస్తాన్ క్రికెటర్ షాహిదీ అఫ్రిదీ ( shahid afridi ) చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను యువరాజ్ సింగ్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. దేశం కోసం క్రికెట్ ఆడిన ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా షాహిద్ అఫ్రీది వ్యాఖ్యలను తాను సమర్థించనంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించివ యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ).. ఇప్పుడిలా తోటి క్రికెటర్లపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కోవడం ఏంటని పలువురు నెటిజెన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Read More