Home> క్రీడలు
Advertisement

World Cup 2023: ఏ వరల్డ్ కప్ కి ఇలా జరిగిఉండదేమో.. బోసిపోయిన నరేంద్ర మోదీ స్టేడియం

వరల్డ్ కప్ 2023 అంటేనే ఒక పండగ.. ఫ్యాన్స్, కేరింతలు, హంగామా.. ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ ఈ సారి వరల్డ్ కప్ 2023 మొదటి మ్యాచ్ స్టేడియం పూర్తిగా బోసిపోయింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ లో అభిమానులు కరువయ్యారు. 

World Cup 2023: ఏ వరల్డ్ కప్ కి ఇలా జరిగిఉండదేమో.. బోసిపోయిన నరేంద్ర మోదీ స్టేడియం

World Cup 2023: వరల్డ్ కప్ 2023 కోసం క్రికెట్ ఫ్యాన్స్ చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎదురుచూపుకి ఈ రోజు ఎండ్ కార్డు పడింది. ఈ రోజు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య పోరు ఆరంభమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. 

ఇదిలా ఉండగా.. ప్రపంచ కప్ ప్రారంభం అంటేనే.. ఫ్యాన్స్ హంగామా.. కిక్కిరిసినట్టు ఉండేలా స్టేడియం ఇలాంటివి ఉండటం సాధారణమే.. కానీ దీనికి భిన్నంగా ఈ రోజు ప్రారంభమైన వరల్డ్ కప్ బోసి పోయింది. ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, గత వరల్డ్ కప్ రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ టీములు తలపడున్నాయి. 

అయితే 50-50 ఫార్మాట్లో రెండు జట్లు బలంగానే ఉన్నప్పటికీ ఈ రోజూ స్టేడియం మొత్తం ఖాళీగా కనిపించటం.. అక్కడకోరు అక్కడొకరు కనిపించటం ఆశ్చర్యానికి గురి చేసింది 

వరల్డ్ కప్ ఏర్పాట్లలో ఆలస్యం మరియు టికెట్ బుకింగ్ సమస్యల కారణంగా..  ఇవాళ్టి మ్యాచ్ లో స్టేడియం ఖాళీగా ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏ వరల్డ్ కప్ కి అయిన సరే.. ప్రారంభానికి కొన్ని నెలల ముందే టికెట్లు అయిపోవటం చూసి ఉంటాం లేదా.. టికెట్ల అమ్మకానికి పెట్టిన కొద్దీ క్షణాల్లో టికెట్లు అవటం చూసి ఉంటాం.. కానీ ఈ సారి.. ఈ రోజు మ్యాచ్ ప్రారంభమైనప్పటికీ టికెట్లు ఇంకా అందుబాటులో ఉండటం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది.  

Also Read: Telangana Elections: 22 లక్షల ఓట్లు తొలగింపు.. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈసీ  

ఇదిలా ఉండగా.. ఇటీవలే కేంద్ర మహిళా బిల్లు ఆమోదం తెలిపినందుకు గాను బీజేపీ పార్టీ 40 వేళా సీట్లు బుక్ చేశామనని.. అవన్నీ ఉచితంగా స్త్రీలకూ కేటాయిస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే! అంతేకాకుండా.. మ్యాచ్ చూడటానికి వచ్చిన మహిళలకు ఉచితంగా టీ, లంచ్ కూపన్లు ఇస్తామని ప్రకటించింది. కానీ ఆ ప్రభావం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం కనపడలేదు. టోర్నీ ఫస్ట్ మ్యాచ్ లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం మరియు క్రికెట్ నే ఒక మతంగా భావించే మన దేశంలోనే ఇంట పెద్ద టోర్నీ ప్రారంభానికి ప్రారంభ వేడుకలు లేకపోవటం వంటి అంశాలపై విమర్శలు వస్తున్నాయి. 

Also Read: ENG Vs NZ World Cup 2023 Updates: వరల్డ్ కప్ వేట మొదలు.. తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్.. కీలక ప్లేయర్లు ఔట్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Read More