Home> క్రీడలు
Advertisement

US Open 2021: ఫైనల్లో నోవాక్‌ జకోవిచ్‌కు షాక్...యూఎస్‌ ఓపెన్‌ విజేతగా మెద్వెదెవ్‌

US Open 2021: ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ కు షాక్ తగిలింది. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌తో చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో ఈ ఏడాది ‘క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌’ సాధించి చరిత్ర సృష్టించాలని కలలు కన్న జకోవిచ్ కు నిరాశే మిగిలింది. 

US Open 2021: ఫైనల్లో నోవాక్‌ జకోవిచ్‌కు షాక్...యూఎస్‌ ఓపెన్‌ విజేతగా మెద్వెదెవ్‌

US Open 2021: యూఎస్‌ ఓపెన్‌(US Open 2021) పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌‌లో ప్రపంచ నంబర్‌వన్‌ నోవాక్‌ జకోవిచ్‌కు షాక్ తగిలింది. రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌ విజేతగా నిలిచి, తన కేరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌‌ను అందుకున్నాడు. ఫైనల్‌లో 34 ఏళ్ల జకోవిచ్‌(Novak Djokovic)పై 6-4, 6-4, 6-4 తేడాతో విజయం సాధించిన మెద్వెదెవ్‌(Daniil Medvedev).. టెన్నిస్ చరిత్రలో కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ ఏడాది ‘'క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌'’ సాధించి చరిత్ర సృష్టించాలని కలలు కన్న జకోవిచ్ కు నిరాశే మిగిలింది. 

అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు జకోవిచ్‌ మరికొన్ని రోజులు ఆగాల్సిందే. జకోవిచ్‌ ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో రోజర్‌ ఫెదరర్‌, నాదల్‌ సరసన చేరిన విషయం తెలిసిందే. న్యూయార్క్‌ సిటీలోని ఆర్థర్‌ ఆషే స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్(Final Match) జరిగింది. తొలి సెట్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. తొలిసెట్‌లో 6-4 తేడాతో మెద్వెదెవ్‌ పైచేయి సాధించాడు. 25 ఏళ్ల మెద్వెదెవ్‌ 6-4 తేడాతో రెండో సెట్‌ను కూడా గెలిచాడు. ఇక మూడో సెట్‌లో సెర్బియా యోధుడు జకోవిచ్‌ ఆధిక్యం సాధించలేక తేలిపోయాడు. ఈ సెట్‌లోనూ మెద్వెదెవ్‌ 6-4 తేడాతో విజయం సాధించాడు. 

Also Read: Us Open 2021: యూఎస్‌ ఓపెన్‌లో బ్రిటిష్‌ యువకెరటం సంచలనం..టైటిల్ గెలుచుకున్న ఎమ్మా

2019లో యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరి ఓటమి పాలైన ఈ రష్యా ఆటగాడు.. ప్రస్తుతం టైటిల్‌ గెలిచాడు. మరోవైపు యూఎస్‌ ఓపెన్‌లో సింగిల్స్‌ విభాగంలో ఈసారి ఇద్దరు కొత్త ఛాంపియన్లు టైటిళ్లు సాధించారు. మహిళ సింగిల్స్‌లో 18 ఏళ్ల ఎమ్మా రదుకాను(Emma Raducanu) విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More