Home> క్రీడలు
Advertisement

Chris Gayle: తప్పేనన్న యూనివర్సల్ బాస్‌..

సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడే క్రిస్ గేల్ (Chris Gayle) ఎప్పుడూ ప్రశాంతంగానే కనిపిస్తాడు. అయితే ఈ సారి గేల్ కోపం కట్టలు తెంచుకోవడంతో క్రీడాభిమానులందరూ ఆశ్యర్యానికి లోనయ్యారు. కేవలం ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ కావడంతో అసహనంతో ఎకంగా బ్యాట్‌ను విసిరి వేసి అంపైర్ల ఆగ్రహానికి గురయ్యాడు.

Chris Gayle: తప్పేనన్న యూనివర్సల్ బాస్‌..

universe boss chris gayle getting angry video: న్యూఢిల్లీ: సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడే క్రిస్ గేల్ (Chris Gayle) ఎప్పుడూ ప్రశాంతంగానే కనిపిస్తాడు. అయితే ఈ సారి గేల్ కోపం కట్టలు తెంచుకోవడంతో క్రీడాభిమానులందరూ ఆశ్యర్యానికి లోనయ్యారు. కేవలం ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ కావడంతో అసహనంతో ఎకంగా బ్యాట్‌ను విసిరి వేసి అంపైర్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఐపీఎల్ నియమావళి ఉల్లంఘించినందుకు నిర్వహాకులు ఫైన్ కుడా విధించారు. ఐపీఎల్‌ (IPL 2020) లో భాగంగా శుక్రవారం రాజస్తాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తలపడ్డాయి. పంజాబ్ తరపున బరిలోకి దిగిన గేల్‌ తనదైన స్టైల్‌లో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడ్డాడు. అయితే.. 10 పరుగుల స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గేల్ ఆ తర్వాత మరోసారి సిక్సర్లు, ఫోర్లతో చెలరేగాడు.

భారీ స్కోరు దిశగా నడిపిస్తున్న క్రమంలో.. గేల్‌ను 99 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ యార్కర్‌తో బౌల్డ్ చేశాడు. దీంతో సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఔటైన గేల్‌ అసహనంతో తన బ్యాట్‌ను నేలకేసి విసిరికొట్టాడు. ఆ తర్వాత బౌల్డ్ చేసిన ఆర్చర్‌కు చేతిని (jofra archer) అందించి.. బ్యాట్‌ హేండిల్‌కు తన హెల్మెట్‌ తగిలించి నిరాశగా మైదానాన్ని వీడాడు. Also read: Chris Gayle: మరో అరుదైన ఘనతను సాధించిన యూనివర్సల్ బాస్

అయితే ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు క్రిస్‌ గేల్‌పై అంపైర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఐపీఎల్ నిర్వహకులు గేల్ మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ముందుగా గేల్ తాను చేసింది తప్పేనని ఒప్పుకోవడంతో అంపైర్లు మ్యాచ్ ఫీజులో కోతతోనే సరిపెట్టారు. లేకపోతే అతని కొన్ని మ్యాచ్‌ల నిషేధం విధించేవారు. 

Also read: KXIP VS KKR: కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More