Home> క్రీడలు
Advertisement

వింటర్ ఒలింపిక్స్ ను బహిష్కరించే యోచనలో బ్రిటన్

Winter Olympics 2022: బీజింగ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న శీతాకాల ఒలింపిక్స్ ను బ్రిటన్ బహిష్కరించే అవకాశం ఉందని ఆ దేశంలోని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. మానవ హక్కులను చైనా హరించి వేస్తున్న ఆరోపణలతో దౌత్యపరంగా వింటర్ ఒలింపిక్స్ ను బహిష్కరించే అంశాన్ని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

వింటర్ ఒలింపిక్స్ ను బహిష్కరించే యోచనలో బ్రిటన్

Winter Olympics 2022: వచ్చే ఏడాది చైనా రాజధాని బీజింగ్‌లో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్‌ను (2022 Winter Olympics) బ్రిటన్‌ బహిష్కరించే అవకాశం ఉందని సమాచారం. మానవ హక్కులను చైనా కాలరాస్తున్నదని అందువల్ల దౌత్యపరంగా వింటర్ ఒలింపిక్స్‌ను బహిష్కరించే అంశాన్ని బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ (PM Boris Johnson News) పరిశీలిస్తున్నారని స్థానిక వార్తా పత్రికలు తెలిపాయి.

ఒలింపిక్స్‌ బాయ్‌కాట్‌ దిశగా తగిన నిర్ణయం తీసుకుంటామని యూకే విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ పేర్కొన్నారు. అయితే, బ్రిటన్‌ మంత్రులతోపాటు చైనాలో యూకే రాయబారి కూడా విశ్వ క్రీడల వేడుకల్లో పాల్గొనకూడదనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌కు బీజింగ్‌ ఆతిథ్యమివ్వనుంది.

కరోనా కలకలం

మరోవైపు కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో మరోసారి కొవిడ్‌ కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఆగస్టులో నాన్జింగ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగించగా.. ఆ తర్వాత చైనాలో మరోసారి కొవిడ్‌ కలకలం రేపుతోంది. ఇటీవలే లాన్జౌ నగరంలో(lanzhou city news) లాక్‌డౌన్‌ విధించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా కరోనా వ్యాప్తిని అదుపు చేసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.  

Also Read: దేశవాళీ క్రికెట్లో సంచలనం.. ముస్తాక్ అలీ టోర్నీలో యువ బౌలర్ డబుల్ హ్యాట్రిక్

Also Read: క్లీన్ స్వీప్ పై కన్నేసిన టీమ్ఇండియా.. చివరి టీ20లో విజయం కోసం న్యూజిలాండ్
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More