Home> క్రీడలు
Advertisement

Netherlands Super 12: నమీబియాపై యూఏఈ విజయం.. సూపర్‌ 12కు అర్హత సాధించిన నెదర్లాండ్స్‌! అదృష్టం అంటే ఇదేమరి

Netherlands enters T20 World Cup 2022 Super 12. టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్‌ 12లోకి నెదర్లాండ్స్‌ క్రికెట్ జట్టు ఎంట్రీ ఇచ్చింది.  
 

Netherlands Super 12: నమీబియాపై యూఏఈ విజయం.. సూపర్‌ 12కు అర్హత సాధించిన నెదర్లాండ్స్‌! అదృష్టం అంటే ఇదేమరి

Netherlands advance to T20 World Cup 2022 Super 12: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్‌ 12లోకి నెదర్లాండ్స్‌ క్రికెట్ జట్టు ఎంట్రీ ఇచ్చింది. అదృష్టం కలిసొచ్చిన నెదర్లాండ్స్.. గ్రూప్‌ A నుంచి సూపర్‌ 12లోకి దూసుకెళ్లింది. గ్రూప్‌ A చివరి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో నమీబియాపై యూఏఈ గెలవడంతో..  నెదర్లాండ్స్‌ సూపర్‌ 12కి అర్హత సాధించింది. గ్రూప్‌ A నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు సూపర్‌ 12లోకి దూసుకెళ్లాయి. గ్రూప్‌ B నుంచి స్కాట్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్‌, ఐర్లాండ్ పోటీ పడుతున్నాయి. రేపు సూపర్‌ 12 జట్లు తేలనున్నాయి. 

సూపర్‌ 12కి అర్హత సాధించాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నమీబియా జట్టు చివరి వరకు పోరాడి ఓడిపోయింది. గురువారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 149 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా 8 వికెట్లకు 141 స్కోరుకే పరిమితమైంది. దీంతో యూఏఈ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.

149 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన నమీబియాకు ఆరంభం దక్కలేదు. యూఏఈ బౌలర్లు చెలరేగడంతో 70 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో రుబెన్ ట్రంప్లెమెన్‌ (25)తో కలిసి డేవిడ్ వీజ్‌ (55) పోరాడాడు. ఇద్దరు కలిసి ఎనిమిదో వికెట్‌కు 70 పరుగులు జోడించి.. గెలుపుపై ఆశలు రేపారు. ఇక చివరి రెండు ఓవర్లలో 20 పరుగులు అవసరమైన సమయంలో 19వ ఓవర్ వేసిన యూఏఈ బౌలర్‌ జహూర్ ఖాన్‌ ఆరు పరుగులే ఇచ్చాడు. దీంతో ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు చేయాల్సి వచ్చింది. వీజ్‌ భారీ షాట్‌ కోసం ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దీంతో నమీబియా ఓడిపోయింది.

గ్రూప్‌ A నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్ సూపర్‌ 12లోకి ప్రవేశించాయి. సూపర్‌ 12 గ్రూప్‌ 1లో ఇంగ్లండ్, న్యూజీలాండ్, ఆఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు ఉన్నాయి. గ్రూప్‌ 2లో పాకిస్తాన్, భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. సూపర్‌ 12లోకి ప్రవేశించే మరో రెండు జట్లేవో తేలాలంటే శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే.

Also Read: ఓరి నీ దుంపతెగ.. అది కోడా లేక పామా! కొండచిలువ కబాబ్ తినడం ఏందిరా అయ్యా

Also Read: IND vs PAK: ఒత్తిడిలో ఎలా ఆడాలో విరాట్ కోహ్లీ నేర్పుతాడు: రిషబ్ పంత్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Read More