Home> క్రీడలు
Advertisement

Rafael Nadal: తండ్రైన రాఫెల్ నాదల్.. మగబిడ్డకు జన్మనిచ్చిన మరియా..

Rafael Nadal: స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ భార్య మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లోకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని స్పానిష్​ మీడియా శనివారం వెల్లడించింది.
 

Rafael Nadal: తండ్రైన రాఫెల్ నాదల్.. మగబిడ్డకు జన్మనిచ్చిన మరియా..

Rafael Nadal Baby Boy: టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తొలిసారిగా తండ్రి అయ్యాడు. అతడి భార్య మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లో శనివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాము తల్లిదండ్రులు  కాబోతున్నట్లు జూలైలోనే ఈ జంట వెల్లడించింది. మరో టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ నాదల్‌కు బిడ్డ పుట్టినందుకు శుభాకాంక్షలు తెలిపాడు. "తొలిసారి తల్లిదండ్రులు అయిన రాఫెల్ నాదల్,  మరియా పెరెల్లోకి అభినందనలు. ఈ అద్భుత క్షణాలను అస్వాదించేందుకు మేము మీతో కలుస్తాం. ఆల్ ది బెస్ట్! " అంటూ స్పెయిన్ ఫుట్‌బాల్ క్లబ్ ట్వీట్ చేసింది. 

నాదల్ మారియాను అక్టోబర్ 19, 2019లో వివాహం చేసుకున్నారు. మూడు సంవత్సరాల తర్వాత ఈ జంట బిడ్డకు జన్మనిచ్చారు. క్రీడాటెన్నిస్ చరిత్రలో 22 గ్రాండ్ స్లామ్‌లను నెగ్గిన ఆటగాడిగా నాదల్ చరిత్ర సృష్టించాడు. అతను ప్రస్తుతం ఏటీపీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో కార్లోస్ అల్కరాజ్‌ ఉన్నాడు. 

ఇటీవల లండన్‌లో జరిగిన లావర్ కప్ 2022లో తన చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెదరర్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడాడు. వీరిద్దరూ ఈ మ్యాచ్ లో ఓడిపోయారు. ఈ మ్యాచ్ ద్వారా ఫెదరర్‌ తన కెరీర్ కు ముగింపు పలికాడు. మ్యాచ్ ముగిసిన ఆనంతరం ఈ ఇద్దరు టెన్నిస్ దిగ్గజ ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఫోటో ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అయింది. 

Also Read: Women Asia Cup 2022: బంగ్లాదేశ్​పై భారత మహిళల జట్టు ఘన విజయం.. సెమీస్ బెర్త్ ఖాయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More