Home> క్రీడలు
Advertisement

World Cup 2023: ఆ టాప్ బ్యాటర్‌కు డెంగ్యూ, పాక్ మ్యాచ్‌కు కూడా దూరమేనా

World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 సమయంలో టీమ్ ఇండియాకు మరో షాక్ తగిలింది. జట్టు కీలక ఆటగాడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఫలితంగా దాయాదితో జరిగే కీలక మ్యాచ్‌కు ఆ ఆటగాడు అందుబాటులో లేనట్టే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 

World Cup 2023: ఆ టాప్ బ్యాటర్‌కు డెంగ్యూ, పాక్ మ్యాచ్‌కు కూడా దూరమేనా

World Cup 2023: ప్రపంచకప్ 2023 లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అతి కష్టంతో నెగ్గుకు రాగలిగినా టాప్ ఆర్డర్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కన్పించింది. అనారోగ్యం కారణంగా ఆ మ్యాచ్‌కు దూరమైన ఆ కీలక ఆటగాడు ఇక మరి కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడే అవకాశం కన్పించడం లేదు. 

టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎలా విఫలమయ్యారో మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో స్పష్టంగా తెలిసింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ గట్టెక్కించడంతో మొదటి మ్యాచ్ గెలవగలిగింది. అయితే టీమ్ ఇండియా ఓపెనర్ శుభమన్ గిల్ లేని లోటు మాత్రం కన్పించింది. అనారోగ్యం కారణంగా శుభమన్ గిల్ ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు. వైద్య పరీక్షల్లో శుభమన్ గిల్‌కు డెంగ్యూగా నిర్ధారణైంది. శుభమన్ గిల్ శరీరంలో ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ప్రస్తుతం శుభమన్ గిల్‌తో పాటు బీసీసీఐ వైద్యుడు రిజ్వాన్ ఖాన్ వెంట ఉంటున్నారు. ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గినందున గిల్‌కు విశ్రాంతి అవసరమని, తదుపరి మ్యాచ్‌కు కూడా గిల్ అందుబాటులో ఉండడని బీసీసీఐ స్పష్టం చేసింది. 

ఇండియా తదుపరి మ్యాచ్ ఢిల్లీలో అక్టోబర్ 11 అంటే రేపు ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనుంది. శుభమన్ గిల్ ఈ మ్యాచ్‌కు కచ్చితంగా అందుబాటులో ఉండడని బీసీసీఐ స్వయంగా వెల్లడించింది. ఇక అక్టోబర్ 14న అహ్మాదాబాద్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో అత్యంత కీలకమైన మ్యాచ్ ఉంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే నిజంగానే హై వోల్టేజ్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో శుభమన్ గిల్ ఆడటం చాలా అవసరం. కానీ అప్పటిలోగా గిల్ కోలుకుంటాడా లేదా అనేది సందేహంగానే ఉంది. ఎందుకంటే డెంగ్యూలో ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోయినప్పుడు చాలా నీరసం ఉంటుంది. విశ్రాంతి చాలా అవసరమౌతుంది. ఈ క్రమంలో మరో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు శుభమన్ గిల్ ఎంతవరకూ అందుబాటులో ఉంటాడనేది ప్రశ్నార్ధకమే. 

Also read: Rachin Ravindra: వరల్డ్ కప్‌లో దుమ్ములేపుతున్న రచిన్ రవీంద్ర.. రాహుల్ ద్రావిడ్, సచిన్‌తో ఉన్న లింక్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More