Home> క్రీడలు
Advertisement

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కు ‘స్పోర్ట్స్ హెర్నియా’.. స‌ర్జ‌రీ కోసం జర్మనీకి వెళ్లనున్న స్టార్ ప్లేయర్..

Suryakumar Yadav: అభిమానులు 'మిస్టర్ 360'గా ముద్దుగా పిలుచుకునే సూర్యకుమార్ యాదవ్ అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. అతడు తాజాగా ‘స్పోర్ట్స్ హెర్నియా' బారిన పడినట్లు తెలుస్తోంది.
 

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కు ‘స్పోర్ట్స్ హెర్నియా’.. స‌ర్జ‌రీ కోసం జర్మనీకి వెళ్లనున్న స్టార్ ప్లేయర్..

Suryakumar Yadav Diagnosed With Sports Hernia: టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ మరికొంత కాలం క్రికెట్ కు దూరం కానున్నాడు. ఇప్పటికే చీలమండ గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్ కు దూరమయ్యాడు సూర్య. ఈ గాయం నుంచి కోలుకోకముందే ఈ మిస్టర్ 360 ప్లేయ‌ర్ ‘స్పోర్ట్స్ హెర్నియా'(Sports Hernia) బారిన ప‌డినట్లు తెలుస్తోంది. దీంతో అతడు త్వరలోనే జర్మనీలోని మ్యూనిచ్‌కు వెళ్లి సర్జరీ చేయించుకోనున్నాడు. ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న అతడు.. త్వరలోనే శస్త్రచికిత్స కోసం జర్మనీకి వెళ్లనున్నాడు. అయితే ఈ స్టార్ బ్యాటర్ దేశవాళీతో పాటు ఐపీఎల్లో పలు మ్యాచులకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్ నాటికి సూర్య అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 

స్పోర్ట్స్ హెర్నియాను  వైద్య ప‌రిభాష‌లో ‘అథ్లెటిక్ పుబ‌ల్జియా'(Athletic Publgia) అని అంటారు. పొత్తి క‌డుపు కింది భాగం లేదా గ‌జ్జ‌ల(Groin) భాగంలోని మృదువైన క‌ణ‌జాలంలోని కండ‌రాలు దెబ్బతినడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఆటగాళ్లు ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా క‌ద‌ల‌డం వ‌ల్ల తుంటి భాగంలో ఉండే క‌ణ‌జాలం, కండ‌రాలు దెబ్బ‌తిని స్పోర్ట్స్ హెర్నియా బారినపడతారు. దీనిని ఎక్కువగా ఫుట్‌బాల్, రెజ్లింగ్, ఐస్ హాకీ వంటి ఆట‌ల్లో చూస్తాం. క్రికెటర్లు అరుదుగా ఈ సమస్య ఎదురవుతుంది. రెండేళ్ల కిందట టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul) కూడా ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డ్డాడు. 2002 జూలైలో స‌ర్జ‌రీ చేయించుకొని మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చి అద్బుతంగా ఆడుతున్నాడు. 

Also Read: Heinrich Klaasen: టెస్టులకు సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్లాసెన్ గుడ్ బై\

Also Read: IND vs ENG: టీమిండియా బిగ్ షాక్.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఆ స్టార్ పేసర్ దూరం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More