Home> క్రీడలు
Advertisement

KL Rahul: కేఎల్ రాహుల్ ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు..అతడో క్లాస్ ప్లేయర్ అన్న మాజీ ఆటగాడు..!

KL Rahul: మరో వారం రోజుల్లో ఆసియా కప్ మొదలు కానుంది. ఈక్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఫామ్‌పై ఆందోళన కల్గిస్తోంది. తాజాగా అతడి ఫామ్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ మహమ్మద్ కైఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

KL Rahul: కేఎల్ రాహుల్ ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు..అతడో క్లాస్ ప్లేయర్ అన్న మాజీ ఆటగాడు..!

KL Rahul: ఇటీవల గాయం నుంచి టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ కోలుకున్నాడు. ప్రస్తుతం జింబాబ్వే సిరీస్‌లో ఆడుతున్నాడు. ఐతే ఆసియా కప్ 2022 ముందు అతడి ఫామ్‌ కలవర పెడుతోంది. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో కేఎల్ రాహుల్‌కు ఆడే అవకాశం రాలేదు. దీంతో రెండో వన్డేలో ఓపెనర్‌గా వచ్చాడు. ఐతే కేవలం ఒక పరుగు చేసి ఔట్ అయ్యాడు. రేపు మూడో వన్డే జరగనుంది. ఈమ్యాచ్‌ ద్వారా అతడు ఫామ్‌లోకి రావాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

ఈక్రమంలో కేఎల్ రాహుల్ ఫామ్‌పై టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్ చాలా క్లాస్ ప్లేయర్ అని..అతడి ఫామ్‌ గురించి ఆందోళన అవసరం లేదన్నాడు. రెండో వన్డేలో అతడు అద్భుత బంతికి ఔట్ అయ్యాడని గుర్తు చేశాడు. కొత్త బంతిని ఎదుర్కోవడం చాలా కష్టమన్నాడు. మ్యాచ్‌ తర్వాత కూడా కేఎల్ రాహుల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేశాడని తెలిపాడు.

fallbacks

తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు అతడు ఎంతో కృషి చేస్తున్నాడని..ఇది అభినందనీయమన్నాడు. ఐపీఎల్‌ తర్వాత కేఎల్ రాహుల్ గాడి తప్పడని..గాయాల పాలు అయ్యాడని గుర్తు చేశాడు. ఐపీఎల్‌లో అతడు భారీగా పరుగులు చేశాడని గుర్తు చేశాడు. గాయం నుంచి కోలుకుని తర్వాత ఫామ్‌ అందుకోవాలంటే కొంచెం సమయం పడుతుందన్నాడు మహమ్మద్ కైఫ్. మరోవైపు కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై భారత పేసర్ మహమ్మద్ సిరాజ్‌ ప్రశంసలు కురిపించాడు. అతడు బౌలర్లకు ఎంతో స్వేచ్చనిస్తున్నాడని తెలిపాడు.

జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమ్‌లో మంచి వాతావరణం ఉందన్నాడు. గత విండీస్, ఇంగ్లండ్ సిరీస్‌లో తాను చాలా బాగా బౌలింగ్ చేస్తున్నానని చెప్పాడు. ఈసిరీస్‌లోనూ అద్భుతంగా బంతులు సంధిస్తున్నానని..భవిష్యత్‌లో ఇదే రిథమ్‌తో ముందుకు వెళ్తానని పేర్కొన్నాడు. మూడో వన్డేలోనూ జట్టు విజయం కోసం కృషి చేస్తానన్నాడు మహమ్మద్ సిరాజ్.

fallbacks

Also read:Crime News: పెద్దపల్లి జిల్లాలో భర్తను చంపించిన భార్య..పోలీసుల దగ్గర కీలక విషయాలు..!

Also read:CM Jagan: ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్..తెలంగాణకు చెక్‌ పెట్టేందుకేనా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More