Home> క్రీడలు
Advertisement

Team India cricketers: ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ ఆలయంలో భారత యువ ఆటగాళ్లు, వీడియో వైరల్

 Ind vs Afg; రెండో టీ20లో అప్ఘాన్ పై విజయం సాధించిన తర్వాత టీమిండియా క్రికెటర్లు సంబరాలు చేసుకోకుండా దైవ సన్నిధిలో గడిపారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. 
 

Team India cricketers: ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ ఆలయంలో భారత యువ ఆటగాళ్లు, వీడియో వైరల్

Team India cricketers: ఎప్పుడు బిజీ బిజీగా గడిపే టీమిండియా క్రికెటర్లు సడన్ గా ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. అంతేకాకుండా తెల్లవారుజామున తొలి పూజలో పాల్గొని మహాకాళేశ్వరునికి (Mahakaleshwar Temple) పూజలు కూడా చేశారు. అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భారత జట్టు రెండో టీ20 ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో విజయం కూడా సాధించింది. 

ఈ క్రమంలో టీమ్ లోని యువ ఆటగాళ్లైన తిలక్‌ వర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, జితేశ్‌ శర్మ, రవి బిష్ణోయ్‌.. సోమవారం వేకువజామున ఉజ్జయినీలోని శ్రీ మహాకాలేశ్వర్‌ ఆలయంలో జరిగిన భస్మ హారతి (Bhasma Aarti) కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణ భక్తులతోపాటు కూర్చుని శివయ్య అభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు. అనంతరం మహాకాళేశ్వరునికి ప్రత్యేకపూజలు చేశారు. పూజ ముగిసిన తర్వాత కూడా చాలాసేపు ఆలయం ప్రాంగణంలోనే గడిపారు.

Also Read: Ind vs Afg T20: రెండవ టీ20లోనూ ఆఫ్ఘన్ పరాజయం, సిరీస్ ఇండియా కైవసం

అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20 పోరులో టీమ్‌ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘాన్ టీమ్ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. గులాబ్దిన్‌ నయీబ్‌(57) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అక్షర్‌ పటేల్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన రోహిత్ సేన 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వి జైస్వాల్‌(34 బంతుల్లో 68, 5ఫోర్లు, 6 సిక్స్‌లు), శివమ్‌ దూబే (32 బంతుల్లో 63 నాటౌట్‌, 5ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి సున్నా పరుగులకే ఔటవ్వగా.. రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీ 29 పరుగులతో పర్వాలేదనిపించాడు. చివరి మ్యాచ్ ఈ నెల 17న బెంగళూరులో జరగనుంది. 

Also Read: IND Vs ENG Test Tickets: ఉప్పల్‌లో భారత్‌-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. టికెట్లు ఇలా బుక్ చేసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More