Home> క్రీడలు
Advertisement

Team India squad: బుమ్రా ఇన్‌.. రాహుల్ ఔట్... ఐదో టెస్టుకు భారత జట్టు ఇదే..!

India vs England: ఐదో టెస్టుకు జట్టును ప్రకటించింది టీమిండియా. గాయంతో ఇబ్బంది పడుతున్న  రాహుల్ ను ఎంపిక చేయకపోగా... నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. 
 

Team India squad: బుమ్రా ఇన్‌.. రాహుల్ ఔట్... ఐదో టెస్టుకు భారత జట్టు ఇదే..!

India squad for 5th Test: మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్  మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చివరి టెస్టుకు జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఐదో టెస్టుకు అందుబాటులో ఉంటాడనుకున్న రాహుల్ ను గాయం కారణంగా ఎంపిక చేయలేదు. అతడు ట్రీట్మెంట్ కోసం లండన్ కు వెళ్లనున్నాడని సమాచారం.  నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్  జస్ప్రిత్‌ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. 

రంజీట్రోఫీలో భాగంగా.. మార్చి 2 నుంచి ముంబైతో జరుగబోయే సెమీస్‌ మ్యాచ్‌ కొరకు వాషింగ్టన్ సుందర్‌ను బీసీసీఐ రిలీజ్‌ చేసింది. అతడు తమిళనాడుకు ఆడనున్నాడు. వేటు తప్పదేమో అనుకున్న పటిదార్ ను కొనసాగించింది.  కొత్త ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌ ధర్మశాల టెస్టులో ఆరంగ్రేటం చేయనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ స్థానంలో పడిక్కల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మెుత్తంగా 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది బీసీసీఐ. సీనియర్ ఆటగాడు కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్ మెుత్తానికి దూరమయ్యాడు. అంతేకాకుండా కోహ్లీకి ఇటీవల కొడుకు కూడా పెట్టాడు. మరోవైపు షమీ రీసెంట్ గా సర్జరీ చేయించుకున్నాడు. తన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు అతడు ట్వీట్ చేశాడు. 

ఐదో టెస్టుకు భారత జట్టు : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), జస్ప్రిత్‌ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), యశస్వీ జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రజత్‌ పాటిదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్ (వికెట్‌ కీపర్‌), కెఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), దేవదత్‌ పడిక్కల్‌, ఆర్‌. అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ముకేష్‌ కుమార్‌, ఆకాశ్‌ దీప్‌.

Also Read: IPL 2024 Tickets: ఐపీఎల్ 2024 మ్యాచ్ టికెట్ల బుకింగ్ ప్రారంభం ఎలా బుక్ చేసుకోవాలి, ధర ఎంత

Also Read: WPL 2024: మ్యాచ్‌ మధ్యలో ఆర్సీబీ ప్లేయర్ కు మ్యారేజ్ ప్రపోజల్... వైరల్ అవుతున్న ఫోటో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

 

Read More