Home> క్రీడలు
Advertisement

World Cup 2011: ధోనీ లాస్ట్ బాల్ సిక్స్ తరువాత.. బాల్ మిస్.. వెతికిపెట్టిన గవాస్కర్

అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni )  రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

World Cup 2011: ధోనీ లాస్ట్ బాల్ సిక్స్ తరువాత.. బాల్ మిస్.. వెతికిపెట్టిన గవాస్కర్

అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni )  రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. టీమ్ ఇండియాకు రెండవ సారి ప్రపంచ కప్ సాధించి పెట్టిన ధోనీ ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడు అని తెలుసుకుని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఐపీఎల్ 2020 లో ( IPL 2020 )  ధోనీ మెరుపులు చూసి కాస్త ఊరటచెందుతున్నారు. అయితే 2011లో వాంఖడే స్టేడియంలో ధోనీ కొట్టిన సిక్స్ గురించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.

ALSO READ| IPL: ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే

ముంబై క్రికెట్ అసోసియేషన్ ( Mumbai Cricket Association ) సభ్యుడు అయిన అజింక్య నాయక్ ధోనీ గురించి భవిష్యత్ తరాలకు మరింతగా గొప్పగా తెలిపేందుకు ఒక చిరస్మరణీయమైన పని చేద్దాం అనుకుంటున్నాడు. దీని కోసం ఎంసియే కు ( MCA ) ఒక ప్రతిపాదన కూడా పెట్టాడు. ప్రపంచ కప్ విజేతగా ( Cricket World Cup 2011 ) నిలిపిన ధోనీ సిక్సు గురించి గుర్తుండే ఉంటుంది. ఆ బాల్ తిన్నగా వెళ్లి ఒక ప్రేక్షకుల గ్యాలరీలోపడింది. అది ఎక్కడ పడిందో ఆ సీటును శాశ్వతంగా ధోనీ పేరుపై ఉంచేయాలి అని ఆయన ప్రతిపాదించాడు.

ఆ బంతి ఎక్కడ పడింది అంటే...
2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో భారత్ ను విశ్వ విజేతగా నిలిపిన భారీ సిక్సర్ బాల్ ఎక్కడ పడిందో తెలుసుకోవడానికి ముంబై క్రికెట్ అసోసియేష్ బాగా కష్టపడింది. ప్రేక్షకులంతా కలిసి ఆటగాళ్లతో విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్న తరుణంలో గ్రౌండ్ సిబ్బంది బంతిని కనుక్కోలేకపోయారు. కానీ తరువాత సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar ) బాల్ ను వెతకడంలో సహాయం చేశాడు. ఇప్పడు ఈ గ్యాలరీలో ఉన్న సీటుకు ధోనీ పేరు పెట్టాలి అని నిర్ణయించారు.

ALSO READ| Mukesh Ambani Facts: ముఖేష్ అంబానీ నిమిషానికి 23 లక్షలు సంపాదిస్తాడు తెలుసా ?

బాల్ తిన్నగా వెళ్లి ఎంసియే పెవీలియన్ లోని ఎల్ బ్లాక్ లోని సీట్ నెం.210లో పడింది. అయితే ఈ సీటులో ఎవరు కూర్చున్నారు అనేది కనుక్కోవడం పెద్ద సవాలుగా మారింది.  అయితే ఇక్కడే గవాస్కర్ ఎంట్రీ ఇచ్చాడు.  ఈ సీటులో గవాస్కర్ స్నేహితుడు కూర్చున్నాడట. అతని వద్దే ఆ సీటుకు సంబంధించిన టికెట్, బంతి ఉండటంతో వాటిని అతని నుంచి తీసుకుని చిరస్మరణీయంగా ఎంసియే గ్రౌండ్ లో సేవ్ చేశారట. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే   ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Read More