Home> క్రీడలు
Advertisement

Tim David Six: టీమ్ డేవిడ్ విధ్వంసం.. ఐపీఎల్‌ చరిత్రలోనే భారీ సిక్సర్‌ (వీడియో)

Tim David hits second longest 114m six in IPL 2022. ఐపీఎల్‌ 2022లో రెండో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా టీమ్ డేవిడ్ నిలిచాడు. ఆ సిక్స్ ఏకంగా 114 మీటర్ల దూరం వెళ్లి స్టేడియంలో పడింది. 

 Tim David Six: టీమ్ డేవిడ్ విధ్వంసం.. ఐపీఎల్‌ చరిత్రలోనే భారీ సిక్సర్‌ (వీడియో)

Mumbai Indians batter Tim David hits second longest 114m six in IPL 2022: ఐపీఎల్‌ 2022లో భాగంగా మంగళవారం (మే 17) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ హిట్టర్ టీమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. 18 బంతుల్లో ఏకంగా 46 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ పేసర్ టీ నటరాజన్ వేసిన 18వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ ఓవర్లో 4 సిక్స్‌లు బాదిన 26 ఏళ్ల టీమ్ డేవిడ్.. ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. అయితే చివరి బంతికి మరో సిక్స్ బాదే క్రమంలో పెవిలియన్ చేరాడు. 

18 ఓవర్ చివరి బంతిని టీ నటరాజన్ ఫుల్ టాస్ వేయగా.. లెగ్ సైడ్ దిశగా టీమ్ డేవిడ్ భారీ సిక్స్‌ బాదాడు. ఆ సిక్స్ ఏకంగా 114 మీటర్ల దూరం వెళ్లి స్టేడియంలో పడింది. దాంతో ఐపీఎల్‌ 2022లో రెండో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా టీమ్ డేవిడ్ నిలిచాడు. ఈ సిక్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫాన్స్ అందరూ టీమ్ డేవిడ్ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశారు. ఇక ఐపీఎల్ 2022లో అత్యంత పొడవైన సిక్సర్‌ను పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ లియామ్ లివింగ్‌స్టోన్ కొట్టాడు. లివింగ్‌స్టోన్ 117 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. 

ఐపీఎల్ 2022లో భారీ సిక్స్ బాదిన జాబితాలో లియామ్ లివింగ్‌స్టోన్, టీమ్ డేవిడ్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ముంబై ఇండియన్స్ ప్లేయర్, జూనియర్‌ డివిల్లియ‌ర్స్‌గా పేరున్న డెవాల్డ్ బ్రెవిస్ మూడో స్థానంలో ఉన్నాడు. డెవాల్డ్ బ్రెవిస్ ఈ సీజన్లో 112 మీటర్ల భారీ సిక్స్‌ర్ కొట్టాడు. అంతకుముందు కూడా లివింగ్‌స్టోన్ 108, 106 మీటర్ల సిక్సర్ బాదాడు. ఐపీఎల్ 2022లో రాజస్థాన్ ప్లేయర్ జొస్ బట్లర్ 107 మీటర్ల సిక్సర్ కొట్టాడు. 

ఐపీఎల్‌ చరిత్రలో భారీ సిక్సర్ బాదిన రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరుపై ఉంది. 2013లో గేల్ 119 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. 2016లో బెన్ కట్టింగ్ 117 మీటర్ల సిక్సర్ కొట్టి ఐపీఎల్‌ టోర్నీలో రెండో స్థానంలో ఉన్నాడు. లియామ్ లివింగ్‌స్టోన్ కూడా 117 మీటర్ల భారీ సిక్స్‌ బాది మూడో స్థానంలో ఉన్నాడు. టీమ్ డేవిడ్ (114), డెవాల్డ్ బ్రెవిస్ (112), క్రిస్ గేల్ (112), ఎంఎస్ ధోనీ (112), ఏబీ డివిల్లియ‌ర్స్‌ (111), ఎంఎస్ ధోనీ (111), ఏబీ డివిల్లియ‌ర్స్‌ (111), క్రిస్ గేల్ (111), డేవిడ్ మిల్లర్ (110) వరుసగా ఉన్నారు. 

Also Read: Kane Williamson: స్వదేశానికి వెళ్లిపోయిన కేన్ మామ.. సన్‌రైజర్స్‌ కొత్త కెప్టెన్ ఎవరంటే?

Also Read: lady rams into Balakrhna house : బాలకృష్ణ ఇంటి గేటును ఢీకొట్టిన యువతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More