Home> క్రీడలు
Advertisement

Ms Dhoni Autograph : ధోనీ ఆటోగ్రాఫ్‌ తీసుకున్న డెయిల్‌ స్టెయిన్‌..!

Dale Steyn Who Became a Fan of Dhoni : డెయిల్‌ స్టెయిన్‌ ఫ్యాన్‌ బాయ్‌ గా మారాడు. టీషర్ట్‌ పై ధోనీ ఆటోగ్రాఫ్‌ తీసుకున్నాడు. ఈ సన్నివేశం చూసిన వారంతా స్టెయిన్‌ కు ధోనీ అంటే ఎంత అభిమానమో తెలిసిపోయిందంటున్నారు.

Ms Dhoni Autograph : ధోనీ ఆటోగ్రాఫ్‌ తీసుకున్న డెయిల్‌ స్టెయిన్‌..!

Dale Steyn Took Dhoni's autograph: టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ అంటే ఎవరికీ అభిమానం ఉండదు. ఎందరో అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ధోనీ ఆటనుఎంతగానో ఇష్టపడుతారు. ఆయన ఆటతీరునే కాకుండా వ్యక్తిగతంగా ధోనీ అందరితో కలిసిపోతాడు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఆటగాళ్లతో మమేకమవుతాడు. ధోనీ అభిమానించే వ్యక్తుల్లో దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌, సన్‌ రైజర్స్‌హైదరాబాద్‌ జట్టు బౌలింగ్‌ కోచ్‌ డెయిల్‌ స్టెయిన్‌ కూడా ఉన్నాడు.  తాజాగా స్టెయిన్‌ ధోనీ ఫ్యాన్‌ గా మారిపోయాడు.

నిన్నటి హైదరాబాద్‌- చెన్నై మ్యాచ్‌ తర్వాత స్టెయిన్‌ ఓ టీషర్ట్‌ పై ధోనీ ఆటోగ్రాఫ్‌ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. డెయిల్‌ స్టెయిన్‌ దక్షిణాఫ్రికా తరఫున 439 టెస్టులు, 196 వన్డేలు, 64 టీట్వంటీ మ్యాచ్‌ లు ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు బౌలింగ్‌ కోచ్‌ గా ఉన్నాడు.

 చెన్నై- హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ లో ధోనీసేన 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది.ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ చివరి వరకు పోరాడి ఓటమిపాలైంది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఈ  మ్యాచ్‌ ముగిసిన తర్వాత ధోనీ.. హైదరాబాద్‌ జట్టులోని యువ ఆటగాళ్లతోనూ ఇంటరాక్ట్‌ అయ్యాడు. వారికి కొన్ని మెళుకువలు నేర్పించాడు.

Also Read: Sarkaru vaari paata trailer review & rating: సర్కారు వారి పాట టీజర్ రివ్యూ, రేటింగ్ ఎలా ఉందో తెలుసా

Also Read: Fact Check: ప్రభుత్వం మన బ్యాంకు అకౌంట్లలో రూ.2.67 లక్షలు జమ చేస్తోందా? మొబైల్‌కు వస్తున్న SMSల్లో నిజమెంత?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More