Home> క్రీడలు
Advertisement

 సౌతాఫ్రికా-విండీస్ మ్యాచ్ రద్దు ; దారుణ స్థితిలో సఫారీలు

వరల్డ్ కప్ ఫోబియా నుంచి దక్షిణాఫ్రికా జట్టు ఇంకా బయటపడినట్లు కనిపించడం లేదు

 సౌతాఫ్రికా-విండీస్ మ్యాచ్ రద్దు ; దారుణ స్థితిలో సఫారీలు

సౌతాఫ్రికా-విండీస్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయింది. ఎడతెరపిలేకుండా కురిసిన వర్షం కారణంగా మైదానమంతా తడిసి ముద్దయింది.  వర్షం మధ్యలో విరామం ఇచ్చినప్పుడు అంపైర్లు మైదానాన్ని పరీక్షించినా మ్యాచ్ కు అనువుగా లేదని తేల్చేశారు. దీంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్న అధికారికంగా ప్రకటించారు. 

 ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్

అంతకు ముందు టాస్ గెలిచిన విండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్ ఫేసర్  షెల్డర్ కాట్రెల్ విజృంభించడంతో సఫారీ టీం వెంటవెంటనే రెండు  వికెట్లు చేజార్చుకుంది. వర్షం కారణంగా పోరుకు అంతరాయం కలిగే సమయానికి సఫారీలు 7.3 ఓవర్లలో 2 వికెట్లకు 29 పరుగులు మాత్రమే చేశారు. ఈ మ్యాచ్ లో ఎలాంటి ఫలితం రాకపోవడంతో  వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. 

సఫారీల పరిస్థితి ఏంటి ?

తాజా పరిణామంతో విండీస్ పరిస్థితి అటుంచితే భారీ అంచనాలతో వరల్డ్ కప్ లో బరిలోకి దిగిన సఫారీ జట్టు తీవ్ర నిరాశ ఎదురైందనే చెప్పాలి. ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడిన ఆ జట్టు  విజయం రుచి చూడలేక నిస్సహాయ స్థితిలో పడిపోయింది. పాయింట్ల పట్టికను పరిశించినట్లయితే చివరి నుంచి ఆప్ఘనిస్తాన్ తర్వాతి స్థానంలో నిలబడి ఉంది. ఇక నుంచి మిగిలిన లీగ్ దశలోనే అన్ని మ్యాచ్ లు గెలిస్తే సరి లేకుండా ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి సఫారీ జట్టు కొని తెచ్చుకుంది

Read More