Home> క్రీడలు
Advertisement

SL VS AUS: చరిత్ర సృష్టించిన శ్రీలంక.. 30 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌ కైవసం!

Sri Lanka wins ODI Series after 30 years at home vs Australia. 30 సంవత్సరాల సుదీర్ఘ విరామానికి తెర దించుతూ.. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను చిత్తుచేసి శ్రీలంక వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. 

SL VS AUS: చరిత్ర సృష్టించిన శ్రీలంక.. 30 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌ కైవసం!

Sri Lanka wins ODI Series after 30 years at home vs Australia: శ్రీలంక క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 30 సంవత్సరాల సుదీర్ఘ విరామానికి తెర దించుతూ.. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను చిత్తుచేసి వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. కొలంబో ప్రేమదాస స్టేడియంలో మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో గెలుపొందడం ద్వారా లంక ఈ ఘనత అందుకుంది. సొంతగడ్డపై 1992 తర్వాత తొలిసారి శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను గెలుచుకుంది.

నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49 ఓవర్లకు 258 పరుగులు చేసింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ నిరోషన్ డిక్‌వెల్లా ఒక పరుగుకే అవుట్ అయ్యాడు. పాథుమ్ నిశ్శంక (13) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. కుశాల్ మెండిస్ కూడా తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. 10 ఓవర్ల లోపే మూడు కీలక వికెట్లు కోల్పోయిన లంకను ధనంజయ డిసిల్వా (61 బంతుల్లో 60; 7 ఫోర్లు), చరిత్ అసలంక (106 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్స్‌) ఆదుకున్నారు. ఆపై దాసున్ శనక (4), దునిత్ వెల్లలగె (19), చమిక కరుణరత్నె (7), జెఫ్రీ వాండెర్సె (0), మహీష్ తీక్షణ (0) విఫలమయ్యారు. వనిందు హసరంగ (21) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అనంతరం ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్‌ వార్నర్‌ (112 బంతుల్లో 99; 12 ఫోర్లు) త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. ఓ దశలో 189/4తో లక్ష్యం దిశగా సాగుతున్న ఆసీస్‌ వరుస వికెట్లు కోల్పోయింది. ప్యాట్‌ కమిన్స్‌ (43 బంతుల్లో 35; 2 ఫోర్లు) పోరాడాడు. దాంతో చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. షనక వేసిన ఈ ఓవర్లో ఆసీస్‌ బ్యాటర్‌ కునెర్మన్‌ తొలి బంతికి పరుగు తీయలేదు. ఆ తర్వాత చెలరేగి 4, 2 ,4, 4తో 14 పరుగులు చేశాడు. దాంతో ఆసీస్‌ విజయానికి చివరి  బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి. అయితే చివరి బంతికి కునెర్మన్‌ను షనక అవుట్‌ చేసి అద్భుత విజయాన్ని లంకకు అందించాడు. 

తాజాగా విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను శ్రీలంక 3–1తో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఓటమి తరువాత లంక గొప్పగా పుంజుకుని వరుసగా మూడింటినీ గెలిచింది. 2012 తర్వాత ఆస్ట్రేలియాపై శ్రీలంక వరుసగా మూడు వన్డేల్లో గెలుపొందడం విశేషం. ఇక ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్‌ శుక్రవారం జరుగుతుంది. అంతకుముందు జరిగిన టీ20 సిరీసును ఆసీస్ 2-1తో కైవసం చేసుకుంది.  

Also Read: AP Inter Results 2022: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

Also Read: Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. పంజాబ్‌లోని ఆస్పత్రికి తరలింపు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Read More