Home> క్రీడలు
Advertisement

RR vs PBKS, IPL 2021: రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం.. Sanju Samson సెంచరీ వృథా

RR vs PBKS match, IPL 2021: ఐపిఎల్ 2021 టోర్నమెంట్‌లో 4వ మ్యాచ్‌‌లో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో పంజాబ్ కింగ్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చివర్లో విజయం ఎవరిని వరిస్తుందా అన్నట్టుగా ఉత్కంఠగా కొనసాగిన ఈ పోరులో చివరకు గెలుపు పంజాబ్ జట్టునే (PBKS) వరించింది.

RR vs PBKS, IPL 2021: రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం.. Sanju Samson సెంచరీ వృథా

RR vs PBKS match, IPL 2021: ఐపిఎల్ 2021 టోర్నమెంట్‌లో 4వ మ్యాచ్‌‌లో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో పంజాబ్ కింగ్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చివర్లో విజయం ఎవరిని వరిస్తుందా అన్నట్టుగా ఉత్కంఠగా కొనసాగిన ఈ పోరులో చివరకు గెలుపు పంజాబ్ కింగ్స్ జట్టునే (PBKS) వరించింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టేన్ సంజూ శాంసన్ (Sanju Samson) బాధ్యాయుతమైన ఇన్నింగ్స్ ఆడి 63 బంతుల్లో 119 పరుగులు ( 12 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి ఒంటరి పోరాటంతో జట్టును విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ.. అతడి శ్రమ అంతా వృథా అయ్యింది.  

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేయగా, 222 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌ జట్టులో సంజూ శాంసన్ మినహా మరెవ్వరూ 25 పరుగులకు మించి రానించలేదు. ఓపెనర్ బెన్ స్టోక్స్ 3 బంతులకే మహ్మద్ షమి బౌలింగ్‌లో డకౌట్ అయి పెవిలియన్ బాట పట్టగా మరో ఓపెనర్ మనన్ ఓహ్రా సైతం 12 పరుగులకే వెనుతిరిగాడు. మూడో బ్యాట్స్‌మెన్‌గా క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (Sanju Samson) చివరి వరకు పోరాడగా, జోస్ బట్లర్ 25, శివం దూబే 23, రియన్ పరాగ్ 25 పరుగులు మాత్రమే చేశారు. 

Also read : SRH vs KKR Match Highlights: ఐపీఎల్ చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

చివర్లో బ్యాటింగ్‌కి వచ్చిన రాహుల్ తెవాతియా, క్రిస్ మోరిస్ చెరో 4 బంతులు ఆడి, చెరో 2 పరుగులతో సరిపెట్టుకున్నారు. దీంతో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు చేతిలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ( Rajasthan Royals) ఓటమి తప్పలేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More