Home> క్రీడలు
Advertisement

Rishabh Pant Car Accident: రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్ వీడియో వైరల్

Rishabh Pant Car Accident CCTV Footage: రిషబ్ పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. డెహ్రడూన్ మ్యాక్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యులు బృందం ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా పంత్ యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 

Rishabh Pant Car Accident: రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్ వీడియో వైరల్

  Rishabh Pant Car Accident CCTV Footage: టీమిండియా వికెట్ కీపన్ రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు తిరిగి వస్తుండగా కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఢిల్లీ-డెహ్రాడూన్ మార్గానికి సమీపంలో రూర్కీలోని నర్సన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హమ్మద్‌పూర్ ఝల్ దగ్గర కారు రైలింగ్‌ను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. కారు రైలింగ్‌ను ఢీకొట్టగానే పంత్ అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకేశాడు. ఈ ఘటనలో పంత్‌ తల, మోకాలు, భుజానికి గాయాలయ్యాయి. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. డెహ్రడూన్ మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

అయితే తాజాగా పంత్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పంత్‌ను కొందరు వ్యక్తులు కాపాడారు. కారు రైలింగ్‌ను ఢీకొట్టిన తరువాత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమై పోయింది. ప్రమాదానికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. 

 

రిషబ్ నుదుటిపై దెబ్బలు తగిలాయి. అతని కుడి మోకాలిలో స్నాయువు చిరిగిపోయింది. కుడి చేయి మణికట్టు, చీలమండ, బొటనవేలుకు గాయాలయ్యాయి. పంత్ వీపుపై రాపిడిలో గాయాలయ్యాయి. ప్రస్తుతం పంత్‌కు ఎంఆర్‌ఐ స్కాన్ చేస్తున్నారు. ఈ రిపోర్ట్ బట్టి గాయాల తీవ్రత తెలుసుకోనున్నారు. 

 

ప్రమాద సమయంలో రిషబ్ పంత్ స్వయంగా కారు నడుపుతూ ఒంటరిగా వచ్చాడు. కారు నడుతున్న టైమ్‌లో కాస్త నిద్ర పట్టడంతో కారు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. పంత్ కళ్లు మూయడంతో రెప్పపాటులో బ్యాలెన్స్ తప్పి.. రైలింగ్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. పంత్ కారు అద్దాలు పగలగొట్టి బయటకు దూకేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో పంత్ అలానే ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. పంత్ త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియాలో వేదికగా కోరుకుంటున్నారు. 

Also Read: Pele Passes Away: పీలే రాకతో కిక్కిరిసిపోయిన కోల్‌కతా నగరం.. పులకరించిన ఈడెన్ గార్డెన్స్  

Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి అసలు కారణం ఇదే.. కారు అద్దాలు పగలగొట్టి మరీ..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

  

Read More