Home> క్రీడలు
Advertisement

RCB vs SRH Dream11 Prediction: ఆర్‌సీబీతో హైదరాబాద్ ఫైట్.. బలాబలాలు, తుది జట్లు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!

RCB vs SRH Head to Head Records: ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ జట్ల మధ్య నేడు ఐపీఎల్‌లో బిగ్‌ ఫైట్ జరగనుంది. వరుస ఓటముల్లో ఉన్న బెంగళూరుకు ఇక నుంచి ప్రతి మ్యాచ్‌ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. ప్లే ఆఫ్‌ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్ చూస్తోంది. 
 

RCB vs SRH Dream11 Prediction: ఆర్‌సీబీతో హైదరాబాద్ ఫైట్.. బలాబలాలు, తుది జట్లు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!

RCB vs SRH Head to Head Records: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేడు కీలక పోరుకు సిద్ధమవుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడనుంది. ఈ సీజన్‌లో దారుణంగా విఫలమవుతున్న ఆర్‌సీబీ.. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడిపోయింది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ చెలరేగుతున్నా.. మిగిలిన ఆటగాళ్ల నుంచి కనీస సహకారం కూడా అందడం లేదు. ముఖ్యంగా ఆర్‌సీబీ బౌలర్ల పరిస్థితి దారుణంగా ఉంది. మహ్మద్ సిరాజ్‌తోపాటు అందరూ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. మొదట బ్యాటింగ్‌లో బెంగళూరు 200 పరుగులుపైగా చేసినా.. విజయం ఖాయమనే పరిస్థితి లేదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌తో విజయం సాధించాలంటే ఆర్‌సీబీ శక్తికి మించి రాణించాల్సిందే. హైదరాబాద్ ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, 6 పాయింట్లతో నాలుగోస్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.

పిచ్ రిపోర్ట్ ఇలా..

బెంగుళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు జరిగాయి. బౌండరీలు చిన్నగా ఉండడంతో ఇక్కడ పరుగుల వరద పారుతోంది. ఇక ఇక్కడ స్పిన్నర్ల కంటే ఫాస్ట్ బౌలర్లకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ పిచ్‌పై 70 శాతం పేసర్లు వికెట్లు తీస్తే.. 30 శాతం స్పిన్నర్లు పడగొట్టారు. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది. 

హెడ్ టు హెడ్ రికార్డులు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఐపీఎల్‌లో మొత్తం 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో ఎస్‌ఆర్‌హెచ్ 12 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఆర్‌సీబీ ఒక మ్యాచ్‌ల విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో వర్షం కారణంగా ఫలితం రాలేదు. చివరి 5 మ్యాచ్‌లలో మూడింటిలో ఆర్‌సీబీ గెలుపొందింది. 

తుది జట్లు ఇలా.. (అంచనా)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాప్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, సుయాష్ ప్రభుదేశాయి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రీస్ టాప్లీ/అల్జారీ జోసెఫ్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, లాకీ ఫెర్గూసన్‌

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి.నటరాజన్

RCB Vs SRH Dream11 Team Tips:

==> వికెట్ కీపర్: క్లాసెన్ (వైస్ కెప్టెన్), దినేష్ కార్తీక్
==> బ్యాట్స్‌మెన్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్
==> ఆల్‌రౌండర్లు: మార్క్రామ్, విల్ జాక్స్, నితీష్‌ రెడ్డి
==> బౌలర్లు: కమిన్, భువనేశ్వర్, సిరాజ్.

Also Read: Glenn Maxwell: ఆర్‌సీబీ విలన్‌గా మారిన మ్యాక్స్‌వెల్.. వరల్డ్ కప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా..!

Also Read: Manchu Manoj: తండ్రి అయిన మంచు మనోజ్..పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భూమా మౌనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More