Home> క్రీడలు
Advertisement

Ashwin Injury: ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు గుడ్ న్యూస్

తమ తొలి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings Xi Punjab)పై ‘సూపర్’ విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals). తర్వాతి మ్యాచ్‌కు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin Injury) సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.

Ashwin Injury: ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు గుడ్ న్యూస్

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో తమ తొలి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings Xi Punjab)పై ‘సూపర్’ విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals). ఓడిపోతుందనుకున్న ఢిల్లీ జట్టును బౌలర్లు స్టోయినిస్, కగిసో రబాడ మాయాజాలంతో అద్భుత విజయాన్ని అందించారు. పోరాడితే ఏదైనా సాధ్యమని, ఐపీఎల్ కేవలం బ్యాట్స్‌మెన్ గేమ్ కాదని, బౌలర్లు అంతే ముఖ్యమని నిరూపించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ శుభవార్త చెప్పాడు. తర్వాతి మ్యాచ్‌కు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin Injury) సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో వెంట వెంటనే 2 వికెట్లు తీసి పటిష్ట స్థితిలో ఉన్న పంజాబ్‌ను ఢిల్లీ బౌలర్ అశ్విన్ కష్టాల్లోకి నెట్టాడు. అదే ఓవర్‌లో చివరి బంతిని పంజాబ్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ లాంగాన్ వైపు ఆడగా.. బంతిని ఆపేందుకు అశ్విన్ యత్నించాడు. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయి కింద పడ్డాడు. ఎడమ చేతికి గాయం గాయంతో ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. అశ్విన్ పడ్డతీరు గమనిస్తే సీజన్‌లో సగం మ్యాచ్‌లు లేకపోతే టోర్నీ మొత్తం దూరమవుతాడన్నట్లు అనిపించింది. 

కాగా, తాను అశ్విన్‌తో మాట్లాడినట్లు ఢిల్లీ కెప్టెన్ అయ్యర్ చెప్పాడు. తనకు ఏ ఇబ్బంది లేదని, మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని అశ్విన్ తనతో చెప్పాడని ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. అయితే అశ్విన్ ఫిట్‌నెస్‌పై ఫిజియో నిర్ణయం తీసుకున్నాకే అశ్విన్ తర్వాతి మ్యాచ్ ఆడతాడని అయ్యర్ వివరించాడు.  Hyderabad: లక్షణాలు లేని వారితోనే కరోనా ముప్పు!: సర్వే

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Read More