Home> క్రీడలు
Advertisement

Obed McCoy: తల్లికి సీరియస్‌గా ఉన్నా..బరిలోకి దిగి ఔరా అనిపించిన మెక్కాయ్..!

Obed McCoy: క్రికెట్‌లో ఒబెడ్‌ మెక్కాయ్ పేరు తెలియని వారు ఉండరు. విండీస్‌కు తన బౌలింగ్‌తో ఎన్నో కీలక విజయాలను అందించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌-2022లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈసీజన్‌లో ఆర్‌ఆర్ విజయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు.

Obed McCoy: తల్లికి సీరియస్‌గా ఉన్నా..బరిలోకి దిగి ఔరా అనిపించిన మెక్కాయ్..!

Obed McCoy: క్రికెట్‌లో ఒబెడ్‌ మెక్కాయ్ పేరు తెలియని వారు ఉండరు. విండీస్‌కు తన బౌలింగ్‌తో ఎన్నో కీలక విజయాలను అందించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌-2022లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈసీజన్‌లో ఆర్‌ఆర్ విజయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. మొన్న జరిగిన క్వాలిఫయిర్ -2లో తన బౌలింగ్‌తో మరోసారి అలరించాడు. ప్రసిద్ధ్‌ కృష్ణతో కలిసి బెంగళూరు టాప్‌ ఆర్డర్‌ను కూల్చాడు. ఈమ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 23 పరుగులు ఇచ్చాడు. ఇందులో మూడు కీలక వికెట్లను తీశాడు.

బెంగళూరు మ్యాచ్‌కు ముందు మెక్కాయ్‌ తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం వచ్చింది. ఐనా బాధను దిగమింగుతూ బరిలోకి దిగాడు. జట్టు విజయం కోసం అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఈవిషయాన్ని ఆ జట్టు హెడ్‌ కోచ్‌ కుమార సంగక్కర తెలిపాడు. ప్రస్తుతం మెక్కాయ్ తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నాడు. బెంగళూరు మ్యాచ్‌కు ముందే విషయం తెలిసిందని..ఐనా ఆ విషయాన్ని పక్కన పెట్టి జట్టు కోసం ఆడాడని సంగక్కర చెప్పాడు.
 
కాసేపట్లో ఐపీఎల్‌-2022 ఫైనల్‌ మ్యాచ్‌ జరగబోతోంది. తుది పోరులో గుజరాత్‌, రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది. ఫైనల్‌లో తప్పక గెలుస్తామని ఇరుజట్లు చెబుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీని షేన్ వార్న్‌కు బహుమతి ఇస్తామని ఆర్‌ఆర్‌ ఆటగాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బలబలాల పరంగా ఇరుజట్లు సమానంగా ఉన్నాయి. తుది వరకు మ్యాచ్‌ ఉత్కంఠగా జరిగే అవకాశం ఉంది.

Also read:IPL 2022 Final: ఐపీఎల్ 2022 విజేత ఎవరో చెప్పేసిన హర్భజన్.. రైనా, అక్తర్ ఓటు ఎవరికో తెలుసా?

 

Also read:Memory Loss: శృంగారంలో పాల్గొంటే మతిమరుపు వస్తుందా..? వైద్యుల వాదన ఏంటి..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More