Home> క్రీడలు
Advertisement

PV Sindhu: డ్యాన్స్ తో అదరగొట్టిన పీవీ సింధు..నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

PV Sindhu: బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు సాంప్ర‌దాయ దుస్తులు ధరించి..డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 
 

PV Sindhu: డ్యాన్స్ తో అదరగొట్టిన పీవీ సింధు..నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

PV Sindhu Dance video viral: బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు త‌న డ్యాన్స్(Dance) ట్యాలెంట్‌ను చూపించింది. కంచీపురం లెహెంగా వేసుకున్న సింధు(PV Sindhu).. చాలా కూల్‌గా ఆ పాట‌కు త‌గ్గ‌ట్లు మూమెంట్స్ ఇచ్చింది. దీంతో ఈ వీడియోను తానే స్వయంగా ఇన్ స్టా(Instagram)లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

ఇండియాకు బ్యాడ్మింటన్(Badminton) వ్యక్తిగత విభాగంలో రెండు సార్లు ఒలింపిక్స్(Olympics medals) పతకాలను అందించింది సింధు. 2016 రియో ఒలింపిక్స్ లో రజత పతకం, 2021 టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతకాలు సాధించి..తన సత్తా ఏంటో చూపించింది. దీంతో ఆమెకు 2020 సంవత్సరానికి గాను కేంద్రప్రభుత్వం పద్మభూషణ్(Padma Bhushan) పురస్కారం ప్రకటించింది. ఆమె నిన్న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sindhu Pv (@pvsindhu1)

 

Also Read: Padma Awards 2021: పద్మ అవార్డుల ప్రదానోత్సవం... PV Sindhu కు పద్మ భూషణ్

2015లో పీవీ సింధుకు ప‌ద్మ‌శ్రీ(Padma sri)అవార్డు దక్కిన విషయం తెలిసిందే. 2020 సంవత్సరానికి గాను కేంద్రం మొత్తం 119 మందిని పద్మ పురస్కారాలకు (Padma awards) ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు (List of Padma awardees 2020) దక్కాయి. అవార్డులు అందుకున్నవారిలో అవార్డులు అందుకున్న‌వారిలో 29 మంది మ‌హిళ‌లు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. పద్మభూషణ్ అవార్డును అందుకోవడానికి ముందు ఈ వీడియోను సింధు పోస్టు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Read More