Home> క్రీడలు
Advertisement

HBL PSL 6 postponed: కరోనా కారణంగా వాయిదా పడిన PSL 2021

Pakistan Super League postponed due to COVID-19: పాకిస్థాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌ని ఉన్నఫళంగా వాయిదా వేస్తున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పాల్గొంటున్న వారిలో గురువారం మరో ముగ్గురు క్రికెటర్స్‌కి COVID-19 పాజిటివ్ రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ స్పష్టంచేసింది.

HBL PSL 6 postponed: కరోనా కారణంగా వాయిదా పడిన PSL 2021

Pakistan Super League postponed due to COVID-19: పాకిస్థాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌ని ఉన్నఫళంగా వాయిదా వేస్తున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పాల్గొంటున్న వారిలో గురువారం మరో ముగ్గురు క్రికెటర్స్‌కి COVID-19 పాజిటివ్ రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ స్పష్టంచేసింది. తాజాగా కరోనా సోకిన ముగ్గురితో కలిపి ఇప్పటివరకు HBL Pakistan Super League 6 లో కరోనా బారినపడిన వారి సంఖ్య మొత్తం 7 కి చేరింది. ఈ టీ20 టోర్నమెంట్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లతో పాటు సిబ్బంది యోగక్షేమాలకు దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని PCB తమ ప్రకటనలో వెల్లడించింది.  

ఫిబ్రవరి 20న ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో మొత్తం 34 మ్యాచులు ఆడాల్సి ఉండగా 14 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. Pakistan Super League 6 లో పాల్గొంటున్న వారికి PCR tests, vaccines, isolation సౌకర్యాలు కల్పిస్తున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇప్పటికే కరోనా సోకిన ఆటగాళ్లంతా ఐసోలేషన్‌లో ఉంటూ COVID-19 tests చేయించుకుంటున్నారు. 

Also read : Ind vs Eng 4th Test Live Score Updates: నాలుగో టెస్టులోనూ రాణిస్తున్న టీమిండియా బౌలర్లు, Ben Stokes ఒంటరి పోరాటం

ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ Fawad Ahmed కి కరోనా సోకడంతో సోమవారం తొలి కేసు నమోదైంది. పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ వసీం ఖాన్, కమెర్షియల్ వింగ్ డైరెక్టర్ బాబర్ హమీద్ నేషనల్ స్టేడియంలో జరగనున్న మీడియా సమావేశంలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More