Home> క్రీడలు
Advertisement

టెస్ట్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన ఫాస్ట్ బౌలర్

టెస్ట్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన ఫాస్ట్ బౌలర్

టెస్ట్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన ఫాస్ట్ బౌలర్

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ టెస్ట్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. టెస్ట్ కెరీర్‌కి వీడ్కోలు పలికిన మొహమ్మద్ అమీర్.. వన్డే, టీ20 ఫార్మాట్లలో కొనసాగనున్నట్టు ప్రకటించాడు. త్వరలోనే ఐసిసి టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పీసిబి (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు)కి ఆటగాళ్ల ఎంపికను సులభతరం చేయడంతోపాటు యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకే తాను టెస్ట్ కెరీర్‌కి గుడ్ బై చెబుతున్నానని అమీర్ పేర్కొన్నట్టుగా పీసీబి ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
2009లో శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొహమ్మద్ అమీర్... మొత్తం 36 టెస్టుల్లో 30.47 సగటుతో 119 వికెట్స్ తీశాడు. 2017లో కింగ్‌స్టన్‌లో వెస్ట్ ఇండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులు ఇచ్చి ఆరు వికెట్స్ తీయడం అతడి బౌలింగ్ కెరీర్‌లో అత్యుత్తమమైన పర్‌ఫార్మెన్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

Read More