Home> క్రీడలు
Advertisement

Haris Rauf: హరీస్ రవూఫ్ బర్త్ డే.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ ఏ చేశారో చూడండి.. వీడియో వైరల్

Shaheen Afridi And Shadab Khan Prank With Haris Rauf: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ బర్త్ డే వేడుకలను సహచర ఆటగాళ్లు గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా  షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ చేసిన ఓ అల్లరి పని నవ్వు తెప్పిస్తోంది.
 

Haris Rauf: హరీస్ రవూఫ్ బర్త్ డే.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ ఏ చేశారో చూడండి.. వీడియో వైరల్

Shaheen Afridi And Shadab Khan Prank With Haris Rauf: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ సోమవారం తన 29వ పుట్టినరోజు జరుపుకున్నాడు. హరీస్ బర్త్ డే సందర్భంగా సహచర ఆటగాళ్లు కేక్ కట్ చేయించి.. వేడుకలు నిర్వహించారు. అయితే అంతకుముందు అతని ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ చేసిన అల్లరి పని అందరికీ నవ్వు తెప్పిస్తోంది. కేక్ కట్ చేయడానికి హరీస్ రవూఫ్ ముందుకు రాగా.. షాహీన్, షాదాబ్ అతనికి అడ్డుగా నిలబడ్డారు. వారు హరీస్‌ను వెనుకకు నెట్టేసి.. ఇద్దరు కేక్ కట్ చేసేందకు పోటీ పడుతున్నట్లు యాక్ట్ చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను పీసీబీ షేర్ చేసింది.

కేక్ వచ్చిన తర్వాత.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ కత్తితో కేక్ కట్ చేయడానికి ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తోంది. వారి ఇద్దరు కేక్ చేయడానికి రాగా.. మిగిలిన ఆటగాళ్లు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్‌ చేశారు. వెనుక నుంచి హరీస్ వచ్చి.. ఇది తన పుట్టిన రోజు అని చెప్పాడు. షాహీన్, షాదాబ్ ఇద్దరూ హరీస్ వైపు చూడగా.. అక్కడ నిలబడి ఉన్న మరో ఆటగాడు అవును.. ఇది అతని పుట్టినరోజు అని చెప్పాడు. తరువాత ఇద్దరు ఆటగాళ్లు కత్తిని హరీస్‌కి ఇచ్చి కేక్ కట్ చేయించారు. అనంతరం అందరూ ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు.

 

ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన హరీస్ రవూఫ్ ఆరు వికెట్లు తీశాడు. అతని సగటు 20.50 ఉండగా.. 6.83 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో హరీస్ రవూఫ్ పాక్ జట్టుకు కీలకంగా మారిపోయాడు. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో సక్సెస్ అవుతున్నాడు.

మరోవైపు నేడు ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్‌తో ఆడుతోంది. అదృష్టవశాత్తూ సెమీస్‌ బెర్త్ దక్కించుకున్న పాక్.. ఎలా రాణిస్తుందో చూడాలి. సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం సాధించగా.. బంగ్లాదేశ్‌ను ఓడించి పాక్ సెమీస్‌లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రవూఫ్ బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. 12 బంతుల్లో 31 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. ప్రస్తుతం అతని బర్త్ డేకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: IND vs PAK: భారత్ vs పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్‌ను జరగనివ్వం.. వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాం!  

Also Read: Ravindra Jadeja: గుజరాత్ ఎన్నికల బరిలో రవీంద్ర జడేజా భార్య, సోదరి.. ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo

Read More